కారు దహనం
ఆర్మూర్‌టౌన్: ఆలూర్ మండలం మచ్చర్లలో మాజీ ఎంపీపీ పస్క నర్సయ్యకు చెందిన కారుకు దుండగులు శుక్రవారం అర్ధరాత్రి నిప్పంటించారు. ఎప్పటిలాగే నర్సయ్య కారును పార్క్ చేసి ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి వేళ కారు దహనమవుతున్నట్లు గమనించిన స్థానికులు అతడికి సమాచారం అందించారు. నర్సయ్య అక్కడికి చేరుకునే సరికి కారు మంటల్లో కాలిపోతోంది. అతడు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితుడు నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.


