హైవేపై కంటైనర్ బోల్తా
భిక్కనూరు : జంగంపల్లి గ్రామ శివారులోని 44వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం రాత్రి కంటైనర్ బోల్తాపడింది. కామారెడ్డి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కంటైనర్ ముందు వెళ్తున్న కారును ఢీ కొట్టి బోల్తా పడడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులతోపాటు కంటైనర్ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. జాతీయ రహదారిపై లారీ బోల్తా పడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో లారీని పక్కకు తప్పించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.


