పోలీస్ ప్రజావాణి వాయిదా
నిజామాబాద్‌అర్బన్: ప్రతి సోమవారం నిర్వహించే పోలీసు ప్రజావాణిని వాయిదా వేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కార్యక్రమాన్ని వాయిదా వేశామని ప్రజలు గమనించాలని పేర్కొన్నారు. ప్రజావాణి మళ్లీ ఎప్పుడు నిర్వహించేది ప్రకటిస్తామని తెలిపారు.
పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మండలం మగ్గిడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు సౌత్ ఇండియా యూనివర్సిటీ వాలీబాల్ పోటీలకు ఎంపికై నట్లు పీఈటీ మధు శనివారం తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఉమెన్స్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న సంజూష, జీజీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న కీర్తీ, ఎస్‌ఎస్‌ఆర్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న స్పందన, నిషిత కళాశాలలో డిగ్రీ చదువుతున్న సాయిరాం, జీజీ కళాశాల విద్యార్థి అజయ్‌తోపాటు మేడ్చల్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న నవీన సౌత్ ఇండియా యూనివర్సిటీ వాలీబాల్ పోటీలకు ఎంపికై నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో త్వరలో నిర్వహించనున్న సౌత్ ఇండియా వాలీబాల్ పోటీల్లో అమ్మాయిలు, చైన్నైలో నిర్వహించనున్న పోటీల్లో అబ్బాయిలు పాల్గొంటారన్నారు. విద్యార్థులను పాఠశాల హెచ్‌ఎం హరిత, పీఈటీ మధు, వీడీసీ సభ్యులు అభినందించారు.
ఇందల్వాయి: సమన్వయంతో పనిచేసి పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేయాలని, తప్పిదాలు జరగకుండా చూడాలని ఎన్నికల సిబ్బందికి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఇందల్వాయిలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ శనివారం పరిశీలించారు. స్వేచ్ఛ వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎంపీడీవో అనంత్‌రావు, తహసీల్దార్ వెంకట్‌రావు తదితరులు ఆయన వెంట ఉన్నారు.
● అప్రమత్తమైన ప్రయాణికులు
సదాశివనగర్(ఎల్లారెడి): మండలంలోని పద్మాజివాడి చౌరస్తాలో ఓ ఆర్టీసీ బస్సులో పొగలు రావడంతో కలకలం రేగింది. 67 మంది ప్రయాణికులతో కామారెడ్డి వైపునకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో నుంచి పద్మాజివాడి చౌరస్తాలో పొగలు వచ్చాయి. ప్రయాణికులు గమనించి వెంటనే డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు. ఆందోళనతో కిందికి దిగారు. పద్మాజివాడి సర్పంచ్ లోకోటి సుబ్బారావు అక్కడికి చేరుకుని ప్రయాణికులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.
పోలీస్ ప్రజావాణి వాయిదా


