నేతల ఫొటోలు లేకుండానే ప్రచారం
మోర్తాడ్: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అ భ్యర్థులకు రాజకీయ పార్టీల మద్దతు ఉన్నా ఆ పార్టీ స్థానిక నేతల ఫొటోలు లేకుండానే సొంతంగా ప్ర చారంలో దూసుకుపోతున్నారు. తమ పార్టీల ము ఖ్య నేతల ఫొటోలను కరపత్రాలు, డోర్ స్టిక్కర్స్‌పై ప్రదర్శించేందుకు ఆలోచిస్తున్నారు. ఒక వేళ ఆ నాయకులపై వ్యతిరేకత ఉంటే ఆ ప్రభావం తమపై చూపుతుందని భయపడుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీల జోక్యం నేరుగా లేదు. ఎక్కువ మంది అభ్యర్థులు వారికి కేటాయించిన గుర్తులు, వారి ఫొటోలను కరపత్రాలు, డోర్ స్టిక్కర్స్‌పై ముద్రించి ప్రచారం కొనసాగిస్తున్నారు. అనేక గ్రామాల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతలు, నియోజకవర్గం నాయకుల ఫొటోలు కనిపించడం లేదు. నాయకులపై వ్యతిరేకత ఉంటే తమకు ఎక్కడ దెబ్బ పడుతుందోననే అనుమానం, పార్టీలకు అతీతంగా ఓట్లు రాబట్టుకోవాలనే కాంక్షతో అభ్యర్థులు సొంతంగానే ప్రచారం సాగిస్తున్నారు. ముఖ్య నేతల ఆశీస్సులు ఉన్నా వారి ఫొటోలు లేకుండా ప్రచారం సాగుతుండటం గమనార్హం.
పార్టీలకు దూరంగా ఉంటూ గుర్తు, తమ ఫొటోతోనే బరిలోకి..
పార్టీల నాయకులపై
వ్యతిరేకత తమపై
ఎక్కడ ప్రభావం
చూపుతుందోననే భయం


