స్వామియే అయ్యప్పో..
● నగరంలో వైభవంగా ఆరట్టు ఉత్సవం
● మార్మోగిన అయ్యప్ప నామస్మరణ
నిజామాబాద్ రూరల్: నగరంలో అయ్యప్ప ఆ రట్టు ఉత్సవాన్ని మాలధారులు శనివారం వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి ఆల యం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర రఘునాథ చెరువు వరకు భక్తిశ్రద్ధలతో సాగింది. అయ్యప్ప నామస్మరణతో నగరం మార్మోగింది. ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ పాల్గొని రథాన్ని ప్రారంభించారు. స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యవంతులుగా ఉండాలని ఆకాంక్షించారు. ధర్మం, భక్తి, క్రమశిక్షణను పెంపొందించే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి, ఐక్యతను బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. ఆలయ చైర్మన్ భక్తవత్సలం, మాలధారులు మంచాల జ్ఞానేందర్ గుప్తా, గజవాడ ఆగమయ్య, యాంసాని రవీందర్, నేతి శేఖర్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ, మాజీ కార్పొరేటర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
స్వామియే అయ్యప్పో..


