దావత్‌లు.. తాయిలాలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పంచాయతీ పోరులో మొదటి దశ పోలింగ్‌కు కొన్ని గంటలే ఉండడంతో ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో అభ్యర్థులు ఓట ర్లను ప్రసన్నం చేసుకునేందుకు అనేక ఫీట్లు చేస్తున్నారు. క్షణం తీరిక లేకుండా అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రలు బిజీబిజీగా గడుపుతున్నారు. అభ్యర్థుల కుటుంబ సభ్యులే కాకుండా స్నేహితులూ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఖర్చు చేస్తున్నారు. గ్రామాల్లో పట్టు నిలుపుకునేందుకు అభ్యర్థులు, తమకు అనుకూలమైన వాళ్లే సర్పంచ్‌లుగా ఉండాలనే ఆకాంక్షతో వాళ్ల స్నేహితులు, పలుకుబడి కలిగిన వ్యక్తులు, వ్యాపారులు అంతా తామై వ్యవహరిస్తున్న పంచాయతీలు జిల్లాలో అనేకం ఉన్నాయి. ఎన్నికలు జరుగుతున్న గ్రామం చుట్టూనే కాకుండా మండల కేంద్రం, ని యోజకవర్గ కేంద్రం, జిల్లా కేంద్రంలో బుధవారం విడతలవారీగా అభ్యర్థుల తరుఫున ప్రత్యేకంగా డెన్‌లు ఏర్పాటు చేసుకుని దావత్‌లు ఏర్పాటు చేశారు. నిజామాబాద్‌కు అనుకుని ఉన్న కొన్ని మండలాలకు సంబంధించిన పలు గ్రామాల ఓటర్లు జిల్లా కేంద్రంలోనే అత్యధికంగా ఉన్నారు. దీంతో ఆయా గ్రామాలకు చెందిన అభ్యర్థుల తరుఫున పలువురు దావత్‌లు చేశారు. కొందరైతే ఏకంగా బడా హోటళ్లలో దావత్‌లు ఏర్పాటు చేసి తా యి లాలు సైతం ఇస్తున్నారు. మాక్లూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓటర్లు 60 శాతం మంది నిజామాబాద్‌లోనే ఉండడంతో భారీ దావత్ ఏ ర్పాటు చేయడం గమనార్హం. ఈ దావత్ వ్యవహారాలన్నీ అభ్యర్థి స్నేహితులే చూసుకుని ఖర్చు చేశారు. అభ్యర్థుల గెలుపు కోసం వాళ్ల మిత్రులు అప్పులు చేసి ఖర్చు చేస్తున్నారు. స్నేహితులు గెలిస్తే తామే గెలిచినట్లుగా భావించి ఖర్చు చేస్తున్న వారున్నారు.
వేర్వేరు పార్టీల్లో ఉంటున్న కుటుంబ సభ్యు లు, బంధువుల మధ్య రాజకీయ వైరం వ్యక్తిగతంగా ఉంటున్న నేపథ్యంలో.. కొందరు మాత్రం తమ స్నేహితుడైన సర్పంచ్ అభ్యర్థికే అధిక ప్రాధ్యానత ఇస్తున్నారు. స్నేహితుడిని గెలుపించుకునే లక్ష్యంతో అహర్నిశలు కష్టపడుతుండడం విశేషం. బోధన్ డివిజన్‌లోని మొదటి విడత పంచాయతీ పోరులోనే ఈ పరిస్థితి ఉంటే రాజకీయంగా మరింతగా ప్రభావి తం చేసే రెండో, మూడో విడతల్లో ఎన్నికలు జరుగనున్న నిజామాబాద్ రూరల్, బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల్లో స్థానిక సమరం ఎలా ఉంటుందోననే చర్చ నడుస్తోంది.
నిజామాబాద్‌అర్బన్: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న బోధన్ డివిజన్ పరిధిలో బందోబస్తు కోసం 1384 మంది పోలీసు సి బ్బందిని బందోబస్తు విధుల కోసం కేటాయించా రు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో అదనపు డీసీపీలు ఇద్దరు, ఏసీపీలు ఐదుగురు, స ర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్‌లు 17 మంది, సబ్ ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఎస్‌ఐలు 71 మంది. ఏఎస్సై లు, ఏఆర్ ఎస్సైలు 74 మంది. హెడ్ కానిస్టేబుళ్లు 192 మంది, కానిస్టేబుళ్లు 789 మంది. హోంగార్డు లు 233 మందిని ఎన్నికల విధులకు కేటాయించా రు. పోలింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు విధించారు. ఐదుగురి కన్నా ఎక్కువ మంది గుమిగూడొ ద్దని పోలీస్ శాఖ ఆదేశించింది. సీపీ సాయిచైతన్య బుధవారం బోధన్‌లోని పలు ప్రాతంల్లో పర్యటించారు. ఎన్నికల సామగ్రి కేంద్రాలను పరిశీలించారు.
1384 మందితో బందోబస్తు
మొదటి విడత పోలింగ్‌కు కొన్ని గంటలే..
తీరిక లేకుండా వ్యూహ ప్రతివ్యూహాల్లో సర్పంచ్ అభ్యర్థులు, బంధువులు,
స్నేహితులు
ఫలితాన్ని ప్రభావితం చేసే పరిస్థితి
ఉండడంతో.. ప్రతి ఓటును వదులు కోకుండా ఫీట్లు
జిల్లా కేంద్రంలో వివిధ గ్రామాల
అభ్యర్థుల తరఫున దావత్‌ల సందడి
దావత్‌లు.. తాయిలాలు
దావత్‌లు.. తాయిలాలు
దావత్‌లు.. తాయిలాలు
దావత్‌లు.. తాయిలాలు
దావత్‌లు.. తాయిలాలు


