నేడు తొలి విడత పోరు
ఓటర్లు : 2,48,585
పోలింగ్ కేంద్రాలు : 1440
బోధన్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడతలో బోధన్ రెవెన్యూ డివిజన్ లోని ఆయా మండలాలతోపాటు నిజామాబాద్ డివిజన్ పరిధిలోని నవీపేట మండలంలో సర్పంచ్, వార్డు స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. ఇందుకోసం అధికారయంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడికి ఽఅధికారులకు ఏర్పాట్లు చేశారు.
పక్కాగా పోలింగ్ సామగ్రి పంపిణీ
బోధన్, సాలూర, ఎడపల్లి, రెంజల్,రుద్రూర్, వర్ని ,కోటగిరి, పొతంగల్, మో స్రా, చందూర్ , నవీపేట మండల కేంద్రాల్లో పోలింగ్ సామగ్రి పంపి ణీని బుధవారం పక్కాగా చేపట్టారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఆర్వో, పీ వోలు, ఇతర సిబ్బందికి బ్యాలెట్‌బాక్స్‌లు, ఇతర మెటీరియల్, బ్యాలెట్ పేపర్లు అందజేశారు. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. విధులు నిర్వర్తించే గ్రామాలకు సిబ్బంది వెళ్లేలా బస్సు సౌకర్యం కల్పించారు.
సందర్శించిన
కలెక్టర్, అధికారులు
వర్ని, చందూర్, మోస్రా మండల కేంద్రాల్లో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సాలూ ర, కోటగిరి మండల కేంద్రా ల్లో సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఎడపల్లిలో ఎన్నికల జిల్లా జనరల్ అబ్జర్వర్ శ్యాంప్రసాద్‌లాల్ పోలింగ్ సామగ్రి పంపిణీని పరిశీలించి పలు సూచనలు చేశారు. నిబంధనలు మేరకు సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని అధికారులు సూచించారు.
పోలింగ్‌కు సర్వం సిద్ధం
ఉదయం 7 నుంచి మధ్యాహ్నం
ఒంటి గంట వరకు ఓటింగ్..
మధ్యాహ్నం 2గంటలకు కౌంటింగ్ ప్రారంభం
మండల కేంద్రాల్లో పోలింగ్
సామగ్రి పంపిణీ పూర్తి
గ్రామాలకు తరలిన ఎన్నికల సిబ్బంది


