పీహెచ్‌డీ నుంచి పంచాయతీకి..
ఖలీల్‌వాడి: ఉస్మానియా యూనివర్సిటీ నుంచి హిందీలో పీహెచ్‌డీ పట్టా పొందిన లాల్‌సింగ్ చందూర్ మండలం కారేగాం తండా సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవలే పీహెచ్‌డీ పూర్తి చేసి న ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల నగారా మోగించడంతో సర్పంచ్‌గా పోటీ చేసేందు కు ఆసక్తి కనబర్చారు. తన స్వగ్రామమైన కారేగాంలో సర్పంచ్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం 11 మంది నామినేషన్‌లు దాఖలు చేసినప్పటికీ.. విద్యావంతుడికి అవకాశం కల్పిస్తే గ్రామాభివృద్ధికి కృషి చేస్తాడని భావించి మిగతా వారంతా తమ నామినేషన్‌లను విత్‌డ్రా చేసుకున్నారు. దీంతో డాక్టర్ రమావత్ లాల్‌సింగ్ సర్పంచ్ కావడం లాంఛనమైంది. ఏబీవీపీ, టీజీవీపీ, టీవీయూవీ వంటి విద్యార్థి సంఘాల్లో చురుగ్గా పనిచేసిన లాల్‌సింగ్ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పోరాడారు. అలాగే ప్రత్యేక తెలంగాణ కోసం వి ద్యార్థి సంఘాల తరఫున ఉద్యమించారు. ప్రస్తుతం టీవీయూవీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్న ఆయన ప్రొఫెసర్ కోదండరామ్‌కు ప్రధాన అనుచరుడిగా ఉన్నారు.


