నిజామాబాద్
న్యూస్‌రీల్
● జక్రాన్‌పల్లి ఎయిర్‌పోర్టు ఆశలపై నీళ్లు
● మూడడుగులు ముందుకు.. పది
అడుగులు వెనక్కి చందంగా వ్యవహారం
నిబంధనలు పాటించాలి
జీపీ ఎలక్షన్స్‌లో ఎన్నికల కమిషన్ నిబంధనలను పోలింగ్ సిబ్బంది పాటించాలని
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు.
బుధవారం శ్రీ 10 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
– 9లో u
గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కొర్రీలు!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లా ప్రజలు 20 ఏళ్లుగా ఎదరుచూస్తున్న జక్రాన్‌పల్లి విమానాశ్ర యం ఏర్పాటులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా (గత సోమవారం) పార్లమెంట్‌లో కేంద్రప్రభుత్వం చేసిన ప్రకటన జిల్లా వాసుల ఆశలపై నీళ్లు చల్లినట్‌లైంది. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి, నాలుగేళ్లు గడిచాక రక్షణ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం కావాలని చెప్పడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జక్రాన్‌పల్లి వద్ద విమానా శ్రయం నిర్మించేందుకు అన్నిరకాలుగా అనుకూలంగా ఉందని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రతిపాదనలు చేశారు. 2021 ఆగస్టులో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి కేంద్ర ప్రభు త్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీస్ ఆఫ్ ఇండియా(ఏఏఐ) సైతం ని వేదిక ఇచ్చింది. ‘టెక్నో ఎకనామిక్ ఫిజిబిలిటీ’ నివేదికను కేంద్ర పౌర విమానయాన శాఖకు, తెలంగాణ ప్రభుత్వానికి ఏఏఐ 2021లోనే అందజేసింది. ఎయిర్‌పోర్ట్ విషయమై సర్వే ప్రక్రియ సైతం పూర్తి చేశారు. జక్రాన్‌పల్లి మండలం తొర్లికొండ, కొలిప్యా క్, అర్గుల్, మనోహరాబాద్, జక్రాన్‌పల్లి రెవెన్యూ గ్రామాల పరిధిలోని 1,663.05 ఎకరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపట్టేలా సర్వే చేశారు. సదరు భూమిలో 816.4 ఎకరాలు మాత్రమే ఉపయోగించబడుతుందని, ఈ 1,663.05 ఎకరాలకు చుట్టూ మరో 68 ఎకరాలు భూమి అవసరం ఉంటుందని నివేదికలో పేర్కొన్నారు. 2021లో ఇచ్చిన నివేదికలో మొదటి దశ విమానాశ్రయం నిర్మాణం కోసం రూ.321 కోట్లు అంచనా వ్యయంగా నివేదికలో పేర్కొన్నారు. ఈ ఎయిర్‌పోర్ట్ నిర్మిస్తే 2024–25 సంవత్సరానికి గాను ఏటా 0.105 మిలియన్ల మంది ప్రయాణికులు, 2054–55 సంవత్సరం నాటికి ఏటా 0.624 మిలియన్ల ప్రయాణికులు సేవలు పొందుతారనే అంచనాలను నివేదికలో వివరించారు. ఐదు గ్రామాల పరిధిలోని 700 మంది పట్టాదారులకు చెందిన 802.37 ఎకరాలు, మరో 913 అసైన్డ్ పట్టాదారులకు సంబంధించిన 860.08 ఎకరాలతో కలిపి 1,613 మంది పట్టాదారులు, అసైన్డ్ పట్టాదారులకు సంబంధించిన మొత్తం 1,663.05 ఎకరాల్లో సర్వే చేశారు.
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..
రాష్ట్రంలో మొత్తం ఆరు చోట్ల విమానాశ్రయాలకు ప్రతిపాదనలు ఉండగా 2021లో ఏఏఐ ఇచ్చిన నివేదికలో మూడింటికి మాత్రమే అనుమతి లభించింది. వరంగల్ జిల్లా మామునూరు, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్‌లలో బ్రౌన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లిలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులు నిర్మించేందుకు ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే వీటిలో మామునూరు, ఆదిలాబాద్ బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయాలు, గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల్లో జక్రాన్‌పల్లికి గ్రీన్‌సిగ్నల్ లభించింది. 2021 జూలై 23న అప్పటి నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకు అప్పటి పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్యసింథియా బదులిస్తూ తెలంగాణలో విమానాశ్రయాల ఏర్పాటు ప్రక్రియ నడుస్తోందన్నారు. అయితే ఇప్పుడు మాత్రం పార్లమెంటులో మరోరకంగా ప్రకటించడం పట్ల విమర్శలు వస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం తిరస్కరించిన పెద్దపల్లి (బసంత్‌నగర్) విమానాశ్రయానికి తాజాగా అనుకూలంగా ఉన్నట్లు ప్రకటించడం గమనార్హం.
సర్వే నిర్వహించిన గ్రామాలు, భూముల వివరాలు..
మోసపోతూనే ఉంటాం..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కు మ్మక్కై జిల్లా ప్రజలను మో సం చేస్తున్నాయి. మోచేతికి బెల్లం.. చందంగా 20 ఏళ్లుగా ఆశ చూపి ఊరిస్తూ, ఊరిస్తూ చివరకు మోసం చేశాయి. నాగ్‌పూర్‌తో పోలిస్తే నిజామాబాద్ చాలా లోపలికి ఉంటుంది. అయినప్పటికీ రక్షణ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం ఎందుకో అర్థం కావడం లేదు. డిఫెన్స్ స్ట్రాటజీ అనే అడ్డంకిని కావాలనే సృష్టిస్తున్నారు. జిల్లా ప్రజల్లో చైతన్యం రాకపోతే అన్ని పార్టీల నాయకులు నిండా ముంచుతారు. విమానాశ్రయం విషయంలో ఇలా మోసం చేయడం దారుణం. గతంలో ఆయిల్ డిపో పోగొట్టారు. నిజాం షుగర్స్ తెరిపిస్తామని మోసం చేశారు. పామాయిల్ ఫ్యాక్టరీ అని చెబుతున్నారు. చివరకు టాల్కం పౌడర్ ఫ్యాక్టరీ కూడా పెట్టరు. నా యకులు ప్రజల ప్రయోజనార్థం దీర్ఘకాలిక ప్రణాళిక అనేదే లేకుండా వ్యవహరిస్తున్నారు. జిల్లా ప్ర జల్లో చైతన్యం రానంతవరకు ఇలా మోసపోవాల్సిందే. – నల్ల దినేశ్‌రెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్
మాజీ అధ్యక్షుడు
నిజామాబాద్


