కోతుల బెడద లేకుండా చేస్తా
ఐదు గ్యారంటీలతో బరిలోకి..
సిరికొండ(నిజామాబాద్ రూరల్): తనను సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామంలో కోతుల బెడద లేకుండా చేస్తానని సిరికొండ మండల కేంద్రం సర్పంచ్ అభ్యర్థి గంగాధర్ హామీ ఇచ్చారు. ఈ మేరకు కోతులు పట్టేవారితో బాండ్‌పై మంగళవారం ఒప్పందం చేసుకోవడం గమనార్హం. కోతుల బె డద నివారణకు ఏడాదికి రూ.4 లక్షల వరకు ఖర్చు చేస్తానని గంగాధర్ పేర్కొన్నారు.
సిరికొండ: సర్పంచ్‌గా తనను గెలిపిస్తే ‘ఐదు గ్యారంటీలు’ అమలు చేస్తానంటున్నాడు మండలంలోని ముషీర్‌నగర్ గ్రామ అభ్యర్థి బట్టు భీమానాయక్. కాంగ్రెస్ మద్దతుతో ఎన్నికల బరిలో నిలిచిన ఆయన ‘భీమన్న పెండ్లి కానుక, ప్రసూతి కానుక, దసరా కానుక, నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయం, విద్యార్థుల భవిష్యత్తు’ అంటూ ఐదు గ్యారంటీలను అమలు చేస్తానని హామీ ఇస్తున్నాడు. కరపత్రాలను రూపొందించి ప్రచారం చేస్తున్నాడు.
కోతుల బెడద లేకుండా చేస్తా


