కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ
నిజామాబాద్‌అర్బన్: సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొని తెలంగాణ గీతాన్ని ఆలపించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆర్ అండ్ బీ ఎస్‌ఈ కె సర్దార్‌సింగ్ ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఆకట్టుకునే రీతిలో, స్ఫూర్తిదాయకంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం అందరినీ ఆకర్షించింది. కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఆదర్శ మహిళ సోనియా
నిజామాబాద్ రూరల్: దేశానికి ఆదర్శ మహి ళ సోనియా గాంధీ అని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌రెడ్డి అన్నారు. జి ల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవా రం ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోని యా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వ హించారు. సోనియా చిత్రపటానికి క్షీరాభి షేకం చేశారు. నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేశారు. నగేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటులో సోనియా పాత్ర కీలకమని పేర్కొన్నారు. పార్టీ నగర అధ్యక్షుడు బొబ్బి లి రామకృష్ణ, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్, నుడా చైర్మన్ కేశవేణు, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్‌గౌడ్,నరాల రత్నకర్, ఎన్‌ఎస్‌యూఐ యూ త్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్‌గౌడ్, నాయకు లు వైశాక్షి సంతోష్, చంద్రకళ, రేవతి, పోల ఉష, సుజాత తదితరులు పాల్గొన్నారు.
జాతీయస్థాయి శిక్షణలో ఉమ్మడి జిల్లా ఉపాధ్యాయులు
ఖలీల్‌వాడి: దేశంలోని ఆయా ప్రాంతాల సంస్కృతులపై అవగాహన కల్పించేందుకు సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్స్ ట్రైనింగ్ రీజినల్ సెంటర్ ఆధ్వర్యంలో రాజస్థాన్‌లోని ఉ దయ్‌పూర్‌లో నిర్వహిస్తున్న శిక్షణలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు పా ల్గొంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం అన్సాన్‌పల్లి జెడ్పీహెచ్‌ఎస్ హిందీ ఉపాధ్యాయుడు ప్రకాశ్ విస్లావత్, కామారెడ్డి జిల్లా బాణాపూర్ జెడ్పీహెచ్‌ఎస్ తెలుగు ఉపాధ్యాయుడు రవికుమార్ గ త నెల 26 నుంచి ఈనెల 16వరకు కొనసా గుతున్న శిక్షణలో రాష్ట్రానికి చెందిన మరో ఆరుగురు టీచర్లతో కలిసి పాల్గొంటున్నారు.
14న జాబ్‌మేళా
ఖలీల్‌వాడి: ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థుల కోసం ఈనెల 14వ తేదీన హెచ్‌సీఎల్ టెక్ బీ ఉద్యోగ మేళా నిర్వహిస్తోందని డీఈఐవో ర వికుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024–25లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, ఏంఈసీ, సీఈసీతోపాటు ఒకేషన ల్ కంప్యూటర్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థు లు అర్హులని పేర్కొన్నారు. ఆదివారం ఉ ద యం 10గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుందని, సాఫ్ట్‌వేర్ రంగాన్ని ఎంచుకు నే విద్యార్థులకు ఉపయోగపడుతుందని తెలి పారు. ఇంటర్‌లో 75శాతం మార్కులు, మ్యాథ్స్‌లో 60శాతం మార్కులు సాధించిన వారు అర్హులని, నగరంలోని వెంకటేశ్వర కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్‌లో నిర్వహించనున్న జాబ్ మేళాకు విద్యార్థులు హాజరుకావాలని సూచించారు. వివరాలకు 80740 65803 నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.
ర్యాండమైజేషన్ పూర్తి
నిజామాబాద్‌అర్బన్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత పోలింగ్ జరిగే మండలాల పోలింగ్ సిబ్బంది తుది ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, జనరల్ అబ్జర్వర్ శ్యాంప్రసాద్‌లాల్ సమక్షంలో మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించారు. సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, వోపీవోలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు.


