మొదటి విడతకు పకడ్బందీ ఏర్పాట్లు
● బందోబస్తు మధ్య కేంద్రాలకు పోలింగ్ సామగ్రి చేరవేస్తాం
● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్
వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్‌కు పకడ్బందీ ఏ ర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి నయ్ కృష్ణారెడ్డి తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం క మిషనర్ రాణి కుముదిని పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం మాట్లాడారు. పోలింగ్ నిర్వహణ, ఓటరు స్లిప్పుల పంపిణీ, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ఏర్పాటు, పోస్టల్ బ్యాలెట్, వెబ్ క్యాస్టింగ్ ఏర్పాట్లు, పోలీసు బందోబస్తు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, నిఘాబృందాల పనితీరు ప ర్యవేక్షణ తదితర అంశాలపై కమిషనర్ సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ..తొలి విడతలో జిల్లా లోని బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పోతంగల్, రెంజల్, రుద్రూర్, సాలూర, వర్ని, ఎడపల్లి, నవీపేట మండలాల్లో ఈ నెల 11న పోలింగ్ నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. పోలింగ్‌కు అవసరమైన సామగ్రిని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు పంపించామని, బుధవారం ఉదయం నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు బందోబస్తు మధ్య చేరుకునేలా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశామ న్నారు. 31 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి భద్రత ఏర్పాటు, వెబ్ క్యాస్టింగ్ చేయిస్తున్నా మని వివరించారు. వీసీలో సీపీ సాయిచైతన్య, ఎలక్షన్ అబ్జర్వర్ శ్యాంప్రసాద్‌లాల్, అదనపు కలెక్టర్ అంకిత్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్‌రావు, నోడల్ అధికారులు పాల్గొన్నారు.


