మూడో విడత బరిలో 548
సుభాష్‌నగర్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో మూడో విడతలో పోలింగ్ జరగనున్న సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్‌ల ఉపసంహరణ గడువు మంగళవారంతో ముగిసింది. 165 గ్రామ పంచాయతీలకుగాను 19 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 146 సర్పంచ్ స్థానాల్లో 548 మంది బరిలో ఉన్నారు. 1620 వార్డుస్థానాలకు గాను 490 స్థానాలు ఏకగ్రీవంగా కాగా.. 1130 స్థానాల్లో 3042 మంది బరిలో నిలిచారు. మూడో విడత పోలింగ్ ఈనెల 17న జరగనుంది. అభ్యర్థులకు అధికారులు గుర్తులు కేటాయించగా ప్రచార పర్వం మొదలైంది.
మండలాల వారీగా బరిలో నిలిచిన సర్పంచ్ అభ్యర్థులు
ఏకగ్రీవ గ్రామాలు 19..
పూర్తయిన నామినేషన్ల ఉపసంహరణ
బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు
గ్రామాల్లో మొదలైన ప్రచార పర్వం
మూడో విడత బరిలో 548


