కేసీఆర్ దీక్షల ఫలితమే ప్రత్యేక తెలంగాణ
● కాంగ్రెస్, బీజేపీల నుంచి
రాష్ట్రాన్ని కాపాడుకుంటాం
● బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి
● జిల్లాకేంద్రంలో ఘనంగా విజయ్ దివస్
నిజామాబాద్‌అర్బన్: మాజీ సీఎం కేసీఆర్ దీక్షల ఫ లితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఉద్యమంలో ఆయన సంతకం చెరగనిదని బీఆర్ ఎస్ జి ల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళ వారం విజయ్ దివస్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. నాడు కేసీఆర్ చే సిన దీక్షల ఫలితంగానే ఢిల్లీ పీఠాలు కదిలి డిసెంబ ర్ 9న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై చిదంబరం ప్రకటన చేశారన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఏటా నవంబర్ 29న దీక్ష దివస్, డిసెంబర్ 9న విజయ్ దివస్ నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణకు ప్రధాన విలన్ కాంగ్రెస్ అని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును విఫల ప్రయోగంగా చిత్రీకరించేందుకు కాంగ్రెస్, బీజేపీలు కుట్రలు చేస్తున్నాయని, వారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుంటామన్నారు. రా ష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది తెలంగాణ రైసింగ్ గ్లో బల్ సమ్మిట్ కాదని తెలంగాణ క్లోజింగ్ కాంగ్రెస్ గోబెల్స్ సమ్మిట్ అని ఎద్దేవా చేశారు. ఫ్యూచర్ సిటీ వెనుక మోదీ, చంద్రబాబు ఉన్నారని ఆరోపించా రు. అంతకుముందు బీఆర్‌ఎస్ శ్రేణులు పూలంగ్ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. పార్టీ కార్యాల యంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. జీజీహెచ్‌లో రోగులకు పండ్లు పంపిణీ చే శారు. మాజీ ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, జెడ్పీ మాజీ చైర్మన్ విఠల్‌రావు తదితరులు పాల్గొన్నారు.


