ఆదిలాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ ఇన్‌చార్జిగా విక్కీ
నిజామాబాద్ రూరల్: జిల్లా కేంద్రానికి చెందిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విక్కీ యాదవ్‌ను ఆదిలాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ ఇన్‌చార్జిగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి మంగళవారం నియామకం చేశారు. తన నియామకానికి కృషి చేసిన జాతీయ కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జి ఖలీద్, రాష్ట్ర అధ్యక్షులకు విక్కీయాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే ప్రాంతాల్లో మద్యం షాపుల బంద్ కొనసాగుతుందని ఎకై ్సజ్ శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి విడత ఎన్నికలు నిర్వహించే బోధన్ డివిజన్‌లో ఈ నెల 11న సాయంత్రం వరకు మద్యం షాపులు బంద్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. రెండో విడత ఎన్నికలు నిర్వహించే నిజామాబాద్ డివిజన్‌లో ఈనెల 12న సాయంత్రం నుంచి 14వ తేదీ వరకు మద్యం షాపులు బంద్ ఉండనున్నట్లు తెలిపారు. మూడో విడత ఎన్నికలు నిర్వహించే ఆర్మూర్ డివిజన్‌లో ఈ నెల 15న సాయంత్రం నుంచి ఈ నెల 17 వరకు మద్యం షాపుల బంద్ ఉండనున్నట్లు పేర్కొన్నారు. కల్లు దుకాణాలు, బార్లు సైతం బంద్ పాటించాలన్నారు.


