భక్తిశ్రద్ధలతో సంతమల్లన్నకు నైవేద్యాలు
వేల్పూర్: మండలంలోని అంక్సాపూర్ సంతమల్లన్న జాతరలో భక్తులు మంగళవారం భక్తిశ్రద్ధలతో నైవేద్యాలు సమర్పించారు. జాతర నిర్వహించిన మరుసటి రోజు నైవేద్యాలు సమర్పించి సంతమల్లన్నపై తమకున్న భక్తిని చాటుకుంటారు. ఇంటిల్లిపాది, బంధువులతో సహా సంతమల్లన్న ఆలయానికి వచ్చి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఎస్సై సంజీవ్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్‌రెడ్డి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట అంక్సాపూర్ వీడీసీ సభ్యులు ఉన్నారు.


