పెన్సిల్ ఆర్ట్‌తో జీవనోపాధి
పెన్సిల్‌తో చిత్రాలు గీస్తున్న ఈ కళాకారుడి పేరు పోచయ్య. జగిత్యాల జిల్లాకు చెందిన ఇతడు తన కళా నైపుణ్యం(పెన్సిల్ ఆర్ట్)తో పేపర్‌పై పెన్సిల్, స్కెచ్‌లతో చిత్రాలు గీస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. కొన్ని నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ ప్రధాన వీధుల్లో స్టాండ్, లైట్లు ఏర్పాటు చేసుకొని, సెల్‌ఫోన్‌లో ఫొటోను చూస్తూ పేపర్‌పై ఆ చిత్రాన్ని గీస్తూ ఉపాధి పొందుతున్నాడు. ఈక్రమంలో శుక్రవారం రాత్రి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రధాన కాలనీలో రోడ్డు పక్కన చిత్రాలు గీస్తూండగా ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది. పోచయ్య రోడ్డు పక్కన కింద కూర్చొని, లైట్ల వెలుతురులో ఫోన్‌లో ఫొటోను చూస్తూ పేపర్‌పై గీస్తుండగా అటుగా వెళ్లే ప్రజలు సైతం ఆసక్తిగా తిలకించారు. అతడిని సంప్రదించి తమ చిత్రాలను కూడా గీయించుకుంటున్నారు. ‘సాక్షి’ అతడిని పలుకరించగా నిత్యం సుమారు 10 బొమ్మలను గీస్తూ ఉపాధి పొందుతున్నట్లు తెలిపాడు. చిత్రాన్ని బట్టి 15 నుంచి 20 నిమిషాల్లో పెన్సిల్‌తో చిత్రాన్ని గీస్తానని పేర్కొన్నారు. తనకు వచ్చిన ఈ విద్యతో అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ జీవనోపాధిని పొందుతున్నానని తెలిపారు.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్
పెన్సిల్ ఆర్ట్‌తో జీవనోపాధి


