నామినేషన్ తల్లిది.. ప్రచారం కొడుకుది
● కేసు నమోదు చేసిన పోలీసులు
రుద్రూర్: అభ్యర్థికి బ దులు ఆమె తనయుడు తన ఫొటోను వాల్ పో స్టర్లపై వేసుకుని ఎన్నిక ల ప్రచారం నిర్వహించగా పోలీసులు కేసు నమోదు చేశారు. వివరా లు ఇలా.. పొతంగల్ మండలం హంగర్గా ఫా రం సర్పంచ్ అభ్యర్థిగా రజియా బేగం నామినేషన్ వేశారు. ఎన్నికల ప్రచారంలో మాత్రం స ర్పంచ్ అభ్యర్థి పేరు, ఫొటో లేకుండా ఆమె కు మారుడు మహ్మద్ ఫెరోజ్ తన ఫొటోతో వాల్ పోస్టర్లు తయారు చేసి గోడలకు అతికించాడు. ఈ విషయాన్ని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల నియమావళి ధిక్కరించినట్లు గుర్తించిన అధికారులు శుక్రవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోతంగల్ డిప్యూ టి తహసీల్దార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సునీల్ తెలిపారు.
ఎల్లారెడ్డి: సార్వత్రిక ఎన్నికలలో మాత్రమే కనిపించే నోటా (నన్ ఆఫ్ ద ఎబో)ను ఈ సారి జరగనున్న గ్రా మ పంచాయతీ ఎన్నికలలో కూడా ప్రవేశపెట్టారు. నోటా విష యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో పోటీలో ఉన్న అభ్యర్థులు నచ్చకపోతే నోటా ఆప్షన్‌ను ఎంచుకునే వెసులుబాటు కలిగింది. గతంలో పంచాయతీ ఎన్నికలలో నోటా ఆప్షన్ లేనందు వల్ల ఎవరికో ఒకరికి తప్పనిసరిగా ఓటు వే యాల్సి వచ్చేది. కాని ఈసారి నుంచి స్థానిక ఎ న్నికలలో సైతం బ్యాలెట్ పేపర్లో నోటాను పొందుపర్చారు. అలాగే పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు రెండు వేర్వేరు రంగులలో బ్యాలెట్ పేపర్లు ఉండబోతున్నాయి. సర్పంచ్ స్థానానికి గులాబీ రంగు, వార్డు సభ్యుడి ఎన్నికకు తెలుపు రంగులో బ్యాలెట్ పేపర్లు ఉండబోతున్నాయి.
నిజామాబాద్ నాగారం: జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో బాలికలకు సెల్ఫ్ డిఫెన్స్ కోసం కరాటే శిక్షణ ఇవ్వడానికి శిక్షకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి పవన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల కరాటే శిక్షకులు ఈనెల 8న ఉదయం 10 గంటలకు నిజామాబాద్‌లోని పాత కలెక్టర్ మైదానంలో హాజరు కావాలని తెలిపారు. శిక్షణ నిచ్చే మాస్టర్లు తప్పనిసరిగా బ్లాక్ బెల్ట్ కలిగి ఉండి, సర్టిఫికెట్ తమ వెంట తీసుకురావాలని తెలిపారు.
నామినేషన్ తల్లిది.. ప్రచారం కొడుకుది


