ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించొద్దు
బోధన్: పంచాయతి ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలను పాటించాలని, ఎవరైన ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని బోధన్ ఏసీపీ శ్రీనివాస్ అన్నారు. ఎవరైనా గందరగోళం సృష్టించడం, బెదిరింపులకు పాల్పడటం వంటివి చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. బోధన్ రెవెన్యూడివిజన్‌లో ఈ నెల 11న పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం సాలూరలో పోలీస్ శాఖ అధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈసందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. శాంతిభద్రల రక్షణ, ఎన్నికల ప్రక్రియలో అవాంఛనీయ ఘటనలు నిరోధించడమే లక్ష్యంగా ముందస్తుగా ప్రజలను అవగాహన కల్పించడానికి ప్లాగ్ మార్చ్ నిర్వహించామన్నారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా తాము కృషి చేస్తున్నామన్నారు. రూరల్ సీఐ విజయ్‌బాబు, టౌన్ ఎస్‌హెచ్‌వో వెంకటనారాయణ, బోధన్ రూరల్, ఎడపల్లి, రెంజల్, ఎస్సైలు మచ్చేందర్‌రెడ్డి, ముత్యాల రమ, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.


