అవినీతిని అరికట్టడానికి ప్రతిఒక్కరూ కృషిచేయాలి
నిజామాబాద్‌అర్బన్: సమాజంలో అవినీతిని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీ సాయిచైతన్య అన్నారు. నగరంలోని పాత కలెక్టరేట్ మైదానంలో శుక్రవారం అవినీతి నిరోధకశాఖ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. సీపీ జెండా ఊపీ ర్యాలీని ప్రారంభించి, మాట్లాడారు. అవినీతి వల్ల వచ్చే నష్టాలు, ఇబ్బందులను ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇలాంటి ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు.
అవినీతి నిరోధక శాఖ ద్వారా క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారని, ఈ క్యూఆర్ కోడ్ ద్వారా అవినీతిపై ఫిర్యాదులు, సమాచారం అందించవచ్చన్నారు. అదనపు డీసీపీ బస్వ రెడ్డి, అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ శేఖర్ గౌడ్, ఏసీబీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


