ఏకగ్రీవం పంచాయతీల్లో విచారణ
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని ఏకగ్రీవ పంచాయతీల్లో శుక్రవారం ఎంపీడీవో నరేశ్ విచారణ చేశారు. మండలంలోని 11 గ్రామ పంచాయతీల్లో ఒక్కొక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవమయ్యాయి. బాణాపూర్, బాణాపూర్‌తండా, మెంగారంతో పాటు పలు గ్రామా ల్లో విచారణ చేసినట్లు తెలిపారు. సర్పంచులు, వార్డు సభ్యులు ఏకగ్రీవం కావడానికి ఏమైనా ప్రలోభాలకు గురిచేసినా, వేలం పాటలు చేసినా, చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. తహసీల్దార్ సురేష్, తదితరులు పాల్గొన్నారు.
ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని జీజీ కళాశాలలో డిగ్రీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షల్లో ఐదుగురు విద్యార్థులు డిబార్ అయినట్లు ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ నాగరత్నం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షల్లో 1,470 మంది విద్యార్థులకు 74 మంది గైర్హాజరయ్యారు. 1,396 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, ఐదుగురు విద్యార్థులు డిబార్ అయ్యారని చెప్పారు. ఇందులో పరీక్షల నియంత్రణ అధికారి భరత్ రాజ్, అకాడమిక్ కోఆర్డినేటర్ నహీద బేగం ఉన్నారు.
ఏకగ్రీవం పంచాయతీల్లో విచారణ


