ముగిసిన నామినేషన్లు
సుభాష్‌నగర్: గ్రామ పంచాయతీ ఎన్నికల తుది విడత నామినేషన్ల స్వీకరణ పర్వం శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. చివరిరోజు సర్పంచ్, వార్డు స్థానాల కోసం అభ్యర్థులు తరలిరావడంతో రాత్రి వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. సాయంత్రం 5 గంటల్లోపు కేంద్రంలోకి వచ్చిన వారికి టోకెన్లు అందించి దరఖాస్తులు స్వీకరించారు. ఆర్మూర్ రెవెన్యూ డివిజన్‌లోని 165 జీపీలు, 1,620 వార్డుస్థానాలకు నామినేషన్లు స్వీకరించారు. మొత్తం 3,26,029 మంది ఓటర్లు ఉండగా, అందులో 1,50,120 పురుషులు, 1,75,903 మహిళలు, ఆరుగురు ఇతర ఓటర్లు ఉన్నారు.
తరలివచ్చిన అభ్యర్థులు..
చివరి రోజు నామపత్రాల దాఖలుకు అభ్యర్థులు తరలివచ్చారు. ప్రధానంగా సర్పంచ్, వార్డుసభ్యుల స్థానాల ఏకగ్రీవాల కోసం గ్రామాభివృద్ధి కమిటీలు, ఆయా పార్టీల నాయకులు చర్చ లు జరిపినా సఫలీకృతం కాకపోవడంతో నామినేషన్ల దాఖలుకు అభ్యర్థులు పోటాపోటీగా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. గురువారం వరకు సర్పంచ్ స్థానాలకు 469 నామినేషన్లు, వార్డుస్థానాలకు 1,655 నామినేషన్లు దాఖలయ్యాయి. 57 కేంద్రాల ద్వారా నామినేషన్లు స్వీకరించారు. చివరి రోజు సర్పంచ్ స్థానానికి 606, వార్డులకు 2,367 నామినేషన్లు వచ్చాయి. మొత్తం సర్పంచ్ స్థానాలకు 1077, వార్డుస్థానాలకు 4,021 నామపత్రాలు దాఖలయ్యాయి.
నేడు నామినేషన్ల పరిశీలన..
మండలాలవారీగా దాఖలైన నామినేషన్లు..
గ్రామపంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్లు శుక్రవారంతో ముగియగా, శనివారం నామపత్రాల స్క్రూటినీ ఉంటుంది. డిసెంబర్ 9న మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అదేరోజు బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితా, గుర్తులను కేటాయిస్తారు. డిసెంబర్ 17న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటిస్తారు.
రాత్రి వరకు కొనసాగిన
మూడో విడత నామపత్రాల స్వీకరణ
సాయంత్రం 5 గంటల తర్వాత
గేట్లు మూసివేత
అభ్యర్థులకు టోకెన్లు ఇచ్చి దరఖాస్తులు తీసుకున్న అధికారులు
సర్పంచ్ స్థానాలకు 1077,
వార్డు స్థానాలకు 4,021 నామినేషన్లు
ముగిసిన నామినేషన్లు
ముగిసిన నామినేషన్లు


