టీబీ ముక్త్ భారత్‌కు పాటుపడాలి
నిజామాబాద్ నాగారం: ఉద్యోగులు అంకిత భావంతో పని చేసి టీబీ ముక్త్ భారత్ కోసం పాటుపడాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజశ్రీ పేర్కొన్నారు. డీఎంహెచ్‌వో కార్యాలయంలో శుక్రవారం క్షయ విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ఉద్యోగులందరూ సమయపాలన పాటిస్తూ, టీబీ రోగులందరికీ ఉచిత మందులు, నాణ్యమైన సేవలు అందించాలన్నారు. అనుమానితుల నుంచి తెమడ సేకరించి పరీక్ష కేంద్రానికి పంపాలని సూచించారు. గ్రామస్థాయిలో శిబిరాలను ఏర్పాటు చేసుకొని మొబైల్ ఎక్సరే ద్వారా వ్యాధికి గురైన వారిని గుర్తించి చికిత్స అందించాలన్నారు. సమావేశంలో డీటీడీవో దేవీనాగేశ్వరి, డాక్టర్ అవంతి, లక్ష్మణ్, నరేశ్, రవిగౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి విలువిద్య పోటీలకు ఎంపిక
నిజామాబాద్ నాగారం: రాష్ట్రస్థాయి సీనియర్ గర్‌ల్స్ విలువిద్య పోటీలకు ఉమ్మడి జిల్లాల క్రీడాకారులు ఎంపికై నట్లు జిల్లా విలువిద్య కార్యదర్శి గంగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. నాగారంలోని రాజారం స్టేడియంలో ఖేలో ఇండియా ఆర్చరీ ట్రైనింగ్ సెంటర్, నిజామాబాద్ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఎంపిక పోటీల్లో పలువురు క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వారు ఈనెల 7న జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారన్నారు. కోచ్‌లు మద్దుల మురళి, నెనావత్ రవీందర్, ప్రతాప్, దాసులు పాల్గొన్నారు.
సాయుధ దళాలకు మద్దతివ్వాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
● సాయుధ దళాల పతాక దినోత్సవ ర్యాలీ ప్రారంభం
నిజామాబాద్ అర్బన్: సైనికుల త్యాగాలను ప్రతి పౌరుడు గుర్తిస్తూ, వారి సేవల పట్ల గౌరవభావంతో మెలగాలని, సాయుధ దళా లకు మద్దతుగా నిలవాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. సాయుధ దళాల పతాక దినోత్సవం పురస్కరించుకొని ప్రాంతీయ సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని శుక్రవారం కలెక్టరేట్ వద్ద కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. మాజీ సైనికులు, సైనికులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం ఉద్దేశించిన సహాయనిధికి విరాళం అందజేశారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్‌తోపాటు కలెక్టరేట్‌లోని వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు సైని క సంక్షేమ నిధికి తమవంతుగా విరాళాలు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ దేశ రక్షణ కోసం సాయుధ దళాలకు చెందిన సైనికులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా కుటుంబసభ్యులకు దూ రంగా ఉంటూ, రేయింబవళ్లు శ్రమిస్తున్నా రని అన్నారు. కార్యక్రమంలో ప్రాంతీయ సైనిక సంక్షేమ శాఖ అధికారి రవీందర్, మా జీ సైనికుల సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
టీబీ ముక్త్ భారత్‌కు పాటుపడాలి


