‘స్వచ్ఛ ఏవం హరిత’కు 8 పాఠశాలలు
హెడ్‌మాస్టర్లకు ప్రశంసా పత్రాలు ఇస్తున్న కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి
ఖలీల్‌వాడి: స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్‌లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన పాఠశాలలను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అభినందించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను శుక్రవారం అందజేశారు. పథకంలో పొందుపరిచిన 16 అంశాలలో ఉన్నత ప్రమాణాలు పాటించి, పాఠశాలలో ఆహ్లాదకర పరిసరాలు, శుభ్రత, మౌలిక వసతులను కల్పించిన ఎనిమిది మంది హెడ్‌మాస్టర్లను సన్మానించారు. ఈ పాఠశాలలు రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు డీఈవో అశోక్ తెలిపారు. కార్యక్రమంలో సీఎంవో శ్రీనివాస్‌రావు, ప్లానింగ్ కోఆర్డినేటర్ శ్రీధర్‌రెడ్డి, ఏఎంవో బాలకృష్ణరావు, జిల్లా సైన్స్ అధికారి గంగాకిషన్, ఏఎస్‌వో జీవన్ పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయికి ఎంపికై న పాఠశాలల వివరాలు


