శబరిమలకు ప్రత్యేక రైళ్లు
సుభాష్‌నగర్: కేరళ రాష్ట్రంలోని శబరిమలకు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు నిజామాబాద్ స్టేషన్ మేనేజర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం చర్లపల్లి నుంచి కోల్లం (రైలు నెంబర్ 07135) రైల్వేస్టేషన్‌కు, నాందేడ్ నుంచి కొల్లం (07133) వరకు రెండు ప్రత్యేక రైళ్లు నడుస్తాయన్నారు. జనవరి 7న ఉదయం 4.25 గంటలకు నాందేడ్ నుంచి బయల్దేరి మరుసటి రోజు రాత్రి 10గంటలకు చేరుకుంటుందని పేర్కొన్నారు. జనవరి 14, 21 తేదీల్లో ఉదయం 11.20 గంటలకు చర్లపల్లి నుంచి బయల్దేరే ప్రత్యేక రైలు మరుసటి రోజు రాత్రి 10 గంటలకు కోల్లం చేరుతుందని తెలిపారు. తిరిగి కొల్లం (రైలు నెంబర్ 07134) నుంచి 9న ఉదయం 2.30 గంటలకు బయల్దేరి మరుసటి రోజు సాయంత్రం 5.30 గంటలకు నాందేడ్‌కు చేరుకుంటుందన్నారు. ఈ నెల 16, 23న కొల్లం (రైలు నెంబర్ 07136) నుంచి ఉదయం 2.30 గంటలకు బయల్దేరే రైలు మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటి గంటలకు చర్లపల్లికి చేరుకుంటుందని తెలిపారు. అయ్యప్ప భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నాందేడ్ నుంచి బయల్దేరే ప్రత్యేక రైలు ముథ్కేడ్, ధర్మాబాద్, బాసర, నిజామాబాద్, ఆర్మూర్, కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్ మీదుగా వెళ్తుందని తెలిపారు.
14 నుంచి దూరవిద్య
పీజీ తరగతులు ప్రారంభం
ఖలీల్‌వాడి : జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కాలేజీలోని డా.బీ.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పీజీ మొదటి సంవత్సరం విద్యార్థులకు సెమిస్టర్–1 తరగతులు ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభమవుతాయ ని ప్రిన్సిపాల్ డాక్టర్ రామ్‌మోహన్ రెడ్డి, కో ఆర్డినేటర్ డాక్టర్ కె. రజిత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులు తప్పకుండా తరగతులకు హాజరు కావాలని పేర్కొన్నారు. వివరాలకు 73829 29612 నంబర్ లేదా www. braouonline.in వెబ్‌సైట్‌ను సంప్రదించా లని తెలిపారు.
యువకులను
స్వదేశానికి రప్పించాలి
● పార్లమెంట్‌లో ఎంపీ
అర్వింద్ ధర్మపురి
సుభాష్‌నగర్: యువతను నకిలీ ఉద్యోగాల పేరుతో విదేశాలకు తరలించి, సైబర్ నేర గ్యాంగ్‌లకు బందీలుగా మార్చుతున్నారని నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నేత అర్వింద్ ధర్మపురి పేర్కొన్నారు. అత్యంత తీవ్రమైన సమస్యను లోక్‌సభలో నిబంధన 377 కింద గురువారం ఆయన లేవనెత్తారు. యువతను థాయ్‌లాండ్‌లో ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మించి ఏజెంట్లు రూ.లక్షలు వసూలు చేస్తున్నారని ఎంపీ ప్రస్తావించారు. అక్కడికి చేరిన వెంటనే పాస్‌పోర్ట్‌లను స్వా ధీనం చేసుకుని, మయన్మార్‌లోని మయావడ్డి ప్రాంతాల్లోని సైబర్ నేర శిబిరాలకు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. నిజామాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు యువకులు కూడా ఈ ముఠాకు బలై ప్రస్తుతం అక్కడే చిక్కుకుపోయారని పేర్కొన్నారు. వారిని రక్షించి, తిరిగి స్వదేశానికి రప్పించే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. విదేశీ ఉద్యోగాల పేరిట నేరాలకు సహకరిస్తున్న ఏజెంట్లు, రిక్రూటర్లపై కఠినచర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
బిందెలు పంపిణీ చేసిన సర్పంచ్ అభ్యర్థిపై కేసు
తాడ్వాయి (ఎ ల్లారెడ్డి) : కా మారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని కన్‌కల్ గ్రామంలో గురువారం సర్పంచ్ అభ్యర్థి ఓటర్లకు బిందెలను పంపిణీ చేయడంతో ఎన్నికల ప్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. సర్పంచ్ అభ్యర్థి మైలారం రవీందర్‌రెడ్డి గ్రామంలోని కమ్యూనిటీహాల్‌లో ఓటర్లకు బిందెలను పంపిణీ చేస్తుండగా అక్కడికి వెళ్లి 41 బిందెలను స్వాఽధీనం చేసుకున్నారు. రవీందర్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నరేష్ తెలిపారు.
శబరిమలకు ప్రత్యేక రైళ్లు


