కొనసాగుతున్న నామపత్రాల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న నామపత్రాల స్వీకరణ

Dec 5 2025 6:51 AM | Updated on Dec 5 2025 6:51 AM

కొనసాగుతున్న నామపత్రాల స్వీకరణ

కొనసాగుతున్న నామపత్రాల స్వీకరణ

సుభాష్‌నగర్‌ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం కొనసాగింది. ఆర్మూర్‌ రెవెన్యూ డివిజన్‌లోని 165 జీపీలు, 1,620 వార్డుస్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. రెండోరోజు సర్పంచ్‌ స్థానాలకు 294 నామినేషన్లు, వార్డుస్థానాలకు 1,249 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల స్వీకరణ కోసం 57 కేంద్రాలను ఏర్పాటుచేశారు. నేటితో నామపత్రాల స్వీకరణ ప్రక్రియ ముగియనుంది. మొదటిరోజు సర్పంచి స్థానాలకు 174 నామినేషన్లు, వార్డుస్థానాలకు 405 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండ్రోజులకు కలిపి మొత్తం సర్పంచ్‌ స్థానాలకు 469, వార్డుస్థానాలకు 1,655 నామినేషన్లు స్వీకరించారు. నామి నేషన్‌ స్వీకరణ కేంద్రాల వద్ద పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందితో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. పోలీస్‌ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.

మండలం జీపీ నామినేషన్‌లు వార్డులు నామినేషన్‌లు

ఆలూరు 11 22 114 113

ఆర్మూర్‌ 14 51 142 146

బాల్కొండ 10 29 100 108

భీంగల్‌ 27 67 244 224

డొంకేశ్వర్‌ 13 36 118 98

కమ్మర్‌పల్లి 13 35 138 104

మెండోరా 11 34 110 130

మోర్తాడ్‌ 10 23 110 117

ముప్కాల్‌ 07 32 74 97

నందిపేట్‌ 22 65 208 276

వేల్పూర్‌ 18 53 180 179

ఏర్గట్ల 08 22 82 63

మొత్తం 165 469 1620 1655

మండలాలవారీగా దాఖలైన నామినేషన్లు..

నేటితో ముగియనున్న

మూడో విడత నామినేషన్లు..

సర్పంచ్‌ స్థానాలకు 469,

వార్డు స్థానాలకు 1655

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement