ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం
● నిబంధనలు ఉల్లంఘిస్తే
కఠిన చర్యలు తప్పవు
● డీజీపీ శివధర్‌రెడ్డి
కామారెడ్డి క్రైం : ప్రజల భద్రత, రక్షణ పోలీసుల ప్ర ధాన లక్ష్యమని డీజీపీ శివధర్‌రెడ్డి పేర్కొన్నారు. ఓ టర్లు ప్రలోభాలకు గురికాకుండా, స్వేచ్ఛగా తమ ఓ టు హక్కును వినియోగించుకునే వాతావరణాన్ని క ల్పించాలని అధికారులకు సూచించారు. గురువా రం కామారెడ్డికి వచ్చిన ఆయనకు జిల్లా పోలీసు కా ర్యాలయం వద్ద ఎస్పీ రాజేశ్ చంద్ర, నిజామాబాద్ సీపీ సాయి చైతన్య పుష్పగుచ్ఛం అందించి స్వాగ తం పలికారు. పోలీసులనుంచి గౌరవ వందనం స్వీ కరించిన అనంతరం ఉమ్మడి జిల్లా అధికారులతో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మా ట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అత్యంత కీలకమని, ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలను అందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారని పేర్కొన్నారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే వాతావరణాన్ని కల్పించడం పోలీసుశాఖ బాధ్యత అన్నారు. సున్నితమైన పోలింగ్ కేంద్రాల వివరాలను అడిగి తెలుసుకుని అక్కడ తీసుకోవా ల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు ఇచ్చారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, ద్వేషపూరిత, ఎ న్నికలను ప్రభావితం చేసే పోస్టులు పెడితే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 30 యాక్టు అమలులో ఉంది కాబట్టి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఎలాంటి అ నుమతులు లేకుండా విజయోత్సవ ర్యాలీలు చేపట్టరాదన్నారు. ఆదేశాలు ఉల్లంఘించే వారిపై కఠిన చ ర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, నిజామాబాద్ అదనపు కమిషనర్ బస్వారెడ్డి, కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి, పోలీసు అధికారులు పాల్గొన్నారు.


