బలవంతపు ఏకగ్రీవాలు రద్దవుతాయి : కలెక్టర్ వినయ్‌కృష్ణార
ఎన్నికల నిబంధనలు కాదని బలవంతంగా ఏకగ్రీవాలు చేస్తే సహించేది లేదు. ఇలాంటి ఎన్నికలను గుర్తిస్తాం. ఈవిధంగా చేసిన ఎన్నికలను ఈసీ రద్దు చేస్తుంది. కఠిన చర్యలు తీసుకుంటాం. ఎన్నిక ‘ఏకగ్రీవం’ అని నిర్ధారణ చేయడానికి ముందు ‘తప్పనిసరి ఽధ్రువీకరణ’ విధానాన్ని ఈసీ అమలులోకి తెచ్చింది. ఏకగ్రీవాల వెనుక ఎలాంటి అంశాలు దాగి ఉన్నాయనే విషయాన్ని పరిశీలించేందుకు మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేశాం. పోటీలో మిగిలిన ఏకై క అభ్యర్థితోపాటు పోటీ నుంచి తప్పుకున్న అభ్యర్థుల నుంచి లిఖితపూర్వక డిక్లరేషన్ తీసుకుంటాం. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి, సమష్టి నిర్ణయంతో ఏకగ్రీవం అయ్యిందని నిర్ధారణ చేసుకుని నో అబ్జెక్షన్ లెటర్ ఇస్తాం. ఆ తరువాతే ఏకగ్రీవ ఎన్నిక ఫలితాన్ని ప్రకటిస్తాం. ఈ నేపథ్యంలో ఎక్కడైనా ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఏకగ్రీవం చేసినట్లౖతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. సదరు అడ్డదారి, బలవంతపు ఎన్నికను రాష్ట్ర ఎన్నికల సంఘం రద్దు చేస్తుంది. ప్రతి ఎన్నిక, ప్రతి గెలుపు ప్రజల అభిప్రాయాన్ని నిజాయితీగా ప్రతిబింబించేలా ఉండాలి. ప్రజాస్వామ్య పటిష్టతకు ప్రతి ఒక్కరూ నిర్భయంగా కృషి చేయాలి.


