తొలి విడతలో 29 పంచాయతీలు ఏకగ్రీవం
● ప్రకటించిన అధికారులు
● ఎన్నికై న అభ్యర్థులకు
ధ్రువీకరణపత్రాలు అందజేసిన ఆర్వోలు
బోధన్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత బోధన్ డివిజన్ పరిధిలోని 184 గ్రామాల సర్పంచ్‌లు, 1642 వార్డు సభ్యులకు ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ బుధవారం పూర్తయ్యింది. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను అధికారులు ప్రకటించారు. అయితే, పలుచోట్ల సర్పంచ్ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో డివిజన్‌లో 29 పంచాయతీల సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సాలూర మండలంలో సాలంపాడ్ సర్పంచ్‌గా శీలం నర్మదా సంతోష్ రెడ్డి, సాలూర క్యాంప్ సర్పంచ్‌గా దొండేటి విజయబాస్కర్ రెడ్డి, ఫత్తేపూర్ సర్పంచ్ షేక్ నూర హైమద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎడపల్లి మండలంలోని బాపునగర్‌లో సర్పంచ్‌గా నగునూరి అనురాధ, వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఠాణాకలాన్ గ్రామంలోని నామినేషన్ స్వీకరణ కేంద్రంలో వీరందరికీ ఏకగ్రీవంగా ఎన్నికై నట్టు ఆర్వోలు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.
బోధన్‌లో నలుగురు ఏకగ్రీవం..
బోధన్‌రూరల్ : మండలంలోని మావందికాలన్ సర్పంచ్‌గా ఏనాకుంచే శకుంతల, పెంటాకుర్దు సర్పంచ్‌గా వేములపల్లి రాధిక, భూలక్ష్మీ క్యాంప్ సర్పంచ్‌గా కామిరెడ్డి బల్‌రెడ్డి, పెంటాకాలన్ సర్పంచ్‌గా కర్లం కళావతిి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ నాలుగు జీపీల్లో వార్డు మెంబర్లు సైతం ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు పేర్కొన్నారు.
వర్నిలో 10 జీపీలు..
వర్ని: మండలంలో 23 గ్రామపంచాయతీలకు 10 జీపీలో ఒకే ఒక్క నామినేషన్ రావడంతో ఏకగ్రీవమైనట్లు ఎంపీడీవో వెంకటేశ్వర్ బుధవారం వెల్లడించారు. సైదిపూర్ సర్పంచ్‌గా బానోత్ శ్రీరామ్, చేలక తండా సర్పంచ్‌గా శ్రీనివాస్, మల్లారం సర్పంచ్‌గా లక్ష్మణ్, సిద్దాపూర్ సర్పంచ్‌గా బాల్‌సింగ్, చింతలపేట్ సర్పంచ్‌గా గంగారాం, శంకోరా సర్పంచ్‌గా హరిసింగ్, రాజీపేట్ సర్పంచ్‌గా కవిత, రూప్ల నాయక్ తండా సర్పంచ్‌గా రీనా బలరాం, అఫంది ఫారం సర్పంచ్‌గా వినోద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చందూరు మండలంలో లక్ష్మాపూర్ సర్పంచ్‌గా చింతం ఉమా సంజీవ్, కారేగం సర్పంచ్‌గా లాల్ సింగ్ ఏకగ్రీవమైనట్లు ఎంపీడీవో లీలావతి తెలిపారు. మోస్ర మండలంలో ఐదు జీపీలకు 19 మంది పోటీలో ఉన్నట్లు ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు.
దండిగుట్ట సర్పంచ్‌గా ధనుంజయ్..
రెంజల్(బోధన్): మండలంలోని దండిగుట్ట సర్పంచ్‌గా బూరుగుపల్లి ధనుంజయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనపై పోటీ చేసిన అభ్యర్థి రవి బుధవారం నామినేషన్ ఉపసంహరించుకున్నారు. గ్రామంలో 8 వార్డులు ఉండగా 6 వార్డులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ప్రభుత్వ సలహాదారు సొంతూరులో..
నవీపేట: మండలంలోని నారాయణ్‌పూర్‌తోపాటు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి సొంతూరు సిరన్‌పల్లిలో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. నారాయణ్‌పూర్ సర్పంచ్‌గా యెండల లక్ష్మి అలియాస్ సరోజనమ్మ, సిరన్‌పల్లి సర్పంచ్‌గా తొగరి సౌమ్య ఎన్నికయ్యారు.
కోటగిరిలో ఐదు.. పోతంగల్‌లో ఒకటి..
రుద్రూర్: కోటగిరి మండలంలోని రాంపూర్ సర్పంచ్‌గా శాంకి బాయి, అడ్కాస్‌పల్లి సర్పంచ్‌గా రెడ్డి రామకృష్ణ, దేవునిగుట్ట సర్పంచ్‌గా కొర్ర రవి నాయక్, సుద్దులం తండా సర్పంచ్‌గా మూడ్ మౌనిక , వల్లాభపూర్ సర్పంచ్‌గా పుష్పబాయి, పోతంగల్ మండలం పీఎస్‌ఆర్ నగర్ సర్పంచ్‌గా రమాబాయి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
తొలి విడతలో 29 పంచాయతీలు ఏకగ్రీవం
తొలి విడతలో 29 పంచాయతీలు ఏకగ్రీవం
తొలి విడతలో 29 పంచాయతీలు ఏకగ్రీవం
తొలి విడతలో 29 పంచాయతీలు ఏకగ్రీవం
తొలి విడతలో 29 పంచాయతీలు ఏకగ్రీవం
తొలి విడతలో 29 పంచాయతీలు ఏకగ్రీవం
తొలి విడతలో 29 పంచాయతీలు ఏకగ్రీవం
తొలి విడతలో 29 పంచాయతీలు ఏకగ్రీవం
తొలి విడతలో 29 పంచాయతీలు ఏకగ్రీవం
తొలి విడతలో 29 పంచాయతీలు ఏకగ్రీవం
తొలి విడతలో 29 పంచాయతీలు ఏకగ్రీవం
తొలి విడతలో 29 పంచాయతీలు ఏకగ్రీవం
తొలి విడతలో 29 పంచాయతీలు ఏకగ్రీవం
తొలి విడతలో 29 పంచాయతీలు ఏకగ్రీవం


