ఈవీఎం గోడౌన్ పరిశీలన
నిజామాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ ఉన్న ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ కిరణ్ కు మార్ బుధవారం పరిశీలించారు. నిబంధనలకు అనుగుణంగా ఈవీఎం గోడౌన్ సీల్‌ను తెరిపించారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్‌లు, ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన గదుల ను క్షుణ్ణంగా పరిశీలించారు. గోడౌన్ వద్ద భద్ర తా ఏర్పాట్లను తనిఖీ చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన కలెక్టర్, అవి నిరంతరం పనిచేసేలా చూడాలన్నారు. కలెక్టర్ వెంట అగ్నిమాపక శాఖ అధికారి పరమేశ్వర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు ధన్వాల్, సిబ్బంది సాత్విక్, విజేందర్ తదితరులు ఉన్నారు.
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ సెమిస్టర్ పరీక్షల్లో బుధవారం మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతూ ఒక విద్యార్థి డిబార్ అయినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షలకు 2,781 మంది విద్యార్థులకు 2,538 మంది హాజరుకాగా 242 మంది గైరాజరైనట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 6,165 మంది విద్యార్థులకు 5,856 మంది హాజరుకాగా 309 మంది పరీక్ష రాయలేదని తెలిపారు. డిచ్‌పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ పరీక్ష కేంద్రంలో ఒక విద్యార్థి డిబార్ అయినట్లు ప్రొఫెసర్ చంద్రశేఖర్ తెలిపారు.
ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షల్లో ఇద్దరు డిబార్ అయినట్లు ఇంచార్జీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.రంగరత్నం బుధవారం తెలిపారు. 1,572 మంది విద్యార్థులకు 1,524 మంది హాజరుకాగా 48 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నరాు. పరీక్షల నియంత్రణ అధికారి భరత్‌రాజ్, అకడమిక్ కోఆర్డినేటర్ నాహీదా బేగం పర్యవేక్షించారు.
స్ట్రాంగ్ రూమ్ పరిశీలన
నిజామాబాద్‌అర్బన్: పంచాయతీ ఎన్నికల సందర్భంగా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) సెల్‌ను జనరల్ అబ్జర్వర్ శ్యాంప్రసాద్ లాల్ బుధవారం సందర్శించారు. ఎంసీఎంసీ ద్వారా చేపడుతున్న పనుల గురించి అడిగి తెలుసుకుని, రికార్డులను పరిశీలించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే చెల్లింపు వార్తలను జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. అనంతరం స్ట్రాంగ్ రూమ్‌ను సందర్శించి భద్రతా ఏర్పాట్లు, ఎన్నికల సామగ్రిని పరిశీలించారు. ఆయన వెంట డీపీవో శ్రీనివాస్ రావు, డీఆర్డీవో సాయాగౌడ్, ఎంసీఎంసీ కమిటీ మెంబర్, సెక్రెటరీ ఎన్.పద్మశ్రీ, హౌసింగ్ పీడీ పవన్ కుమార్ తదితరులు ఉన్నారు.
ఈవీఎం గోడౌన్ పరిశీలన
ఈవీఎం గోడౌన్ పరిశీలన


