సీఎం క్షమాపణలు చెప్పాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్
సుభాష్‌నగర్: హిందూ దేవుళ్లను అవమానించేలా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు హిందువులపై ప్రత్యక్ష దాడి అని, ఆయన వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తాలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దినేశ్ పటేల్ కులాచారి మాట్లాడుతూ హిందూ దేవతలపై సీఎం చేసిన వ్యాఖ్యలు క్షమించలేనివన్నారు. గతంలో కేసీఆర్ హిందుగాళ్లు.. బొందుగాళ్లు అంటే పాతాళానికి తొక్కిపడేశారని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి కూడా అదే దుస్థితి పడుతుందన్నారు. కేవలం ఒకవర్గం ఓట్ల కోసం కాంగ్రెస్ చేస్తున్న రాజకీయ నాటకమని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, లక్ష్మీనారాయణ, ఆకుల శ్రీనివాస్, బూర్గుల వినోద్, ఇప్పకాయల కిశోర్, మల్లేశ్ గుప్త, గడ్డం రాజు, అంబదాస్ రావు, నారాయణ యాదవ్, గిరిబాబు, ఆమంద్ విజయ్‌కృష్ణ, ఆనంద్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.


