ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలి
● ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలి
● సీపీ సాయిచైతన్య
డిచ్‌పల్లి(జక్రాన్‌పల్లి): పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని, పా త నేరస్తులను గుర్తించి బైండోవర్ చేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయిచైతన్య సూచించారు. జక్రాన్‌పల్లి పోలీస్ స్టేషన్‌ను ఆయన బుధవారం తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ రికార్డులు, బ్యారక్‌లు, అండర్ ఇన్వేస్టిగేషన్ కేసుల రికార్డులు తనిఖీలు చేసి, ప్రతి కేసుకి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏర్పాటు చేసి నాణ్యమైన దర్యాప్తు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రతి పోలింగ్ స్టేషన్‌ను సిబ్బంది స్వయంగా పరిశీలించి కనీస వసతులు కల్పించేలా చూడాలన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని, ప్రతి దరఖాస్తును ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఫిర్యాదుదారునికి ఒక కాపీ ఇచ్చి సంతకం తీసుకోవాలని,రిజిస్టర్‌లో కూడా నమోదు చేయాల ని రిసెప్షనిస్టుకు సూచించారు. పాఠశాలలు, కళాశాలలతోపాటు సోషల్ మీడియా ద్వారా సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల ని ఆదేశించారు. సిబ్బంది హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండాలని, ప్రతి ఆరు నెలలకు ఒకసారి హెల్త్ చెకప్ చేసుకోవాలని సూచించారు. సీపీ వెంట జక్రాన్‌పల్లి ఎస్సై మహేశ్, సిబ్బంది ఉన్నారు.


