విద్యార్థులు ప్రతిభను మెరుగుపర్చుకోవాలి
● వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు
తెయూ(డిచ్‌పల్లి): అధ్యాపకులు, సీనియర్ విద్యార్థుల మార్గనిర్దేశనంలో పీజీ కోర్సుల్లో నూతనంగా ప్రవేశాలు పొందిన విద్యార్థులు తమ ప్రతిభను మరింత మెరుగుపర్చుకోవాలని తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు సూచించారు. తెయూ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బుధవారం నూతన విద్యార్థులకు ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో వీసీ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఫోన్లకు దూరంగా ఉంటూ చదువుపై శ్రద్ధ వహించాలన్నారు. వర్సిటీలో ఉన్న మౌలిక వసతులను ఉపయోగించుకుంటూ చదువులో రాణించాలని సూచించారు. ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరుచుకొని దాన్ని సాధించేందుకు కృషిచేయాలన్నారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్య సాధనలో నిర్లక్ష్యం చూపకుండా ఉన్నత స్థానానికి చేరుకొని వర్సిటీకి పేరు తేవాలని సూచించారు.
కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మామిడాల ప్రవీణ్, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మణ్ చక్రవర్తి, ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్, కంట్రోలర్ ప్రొఫెసర్ సంపత్ కుమార్, అధ్యాపకులు రవీందర్ రెడ్డి, లావణ్య, నాగరాజు, జమీల్ అహ్మద్, అబ్దుల్ ఖవి, బాలకిషన్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు ప్రతిభను మెరుగుపర్చుకోవాలి


