హత్య కేసులో నిందితుడి అరెస్టు
మాక్లూర్: భోజన సమయంలో హమాలీల మధ్య చెలరేగిన ఘర్షణతో ఒకరి మృతికి కారణమైన గుడ్డు కుమార్‌ను మాక్లూర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నార్త్ జోన్ సీఐ శ్రీనివాస్, ఎస్సై రాజశేఖర్ బుధవారం మాక్లూర్ పోలీస్ స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. ఆలూర్ మండలం గుత్ప గ్రామంలో పనులు చేస్తున్న బిహార్ హమాలీల మధ్య ఈ నెల 1వ తేదీ రాత్రి ఘర్షణ జరిగింది. గుడ్డు కుమార్ అనే హమాలీ తోటి హమాలి సంతోష్ తలను పట్టుకొని సిమెంట్ బేస్‌మెంట్‌కు బలంగా కొట్టాడు. తలకు బలమైన గాయం కావడంతో తోటి హమాలీలు సంతోష్‌ను చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సంతోష్ బుధవారం మృతి చెందినట్టు సీఐ శ్రీనివాస్ తెలిపారు. మృతికి కారణమైన గుడ్డు కుమార్‌పై హత్య కేసు నమోదు చేశామన్నారు.
భిక్కనూరు: డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఇద్దరికి ఒక్క రోజు జైలుశిక్షతోపాటు రూ.1000 చొప్పున జరిమానా న్యాయమూర్తి విధించినట్లు భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు బుధవారం తెలిపారు. మండల కేంద్రంలో మంగళవారం వాహనాలను తనిఖీ చేస్తుండగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రానికి చెందిన బండారి తిరుమలయ్య, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని చీమన్‌పల్లి చెందిన మాలోతు అఖిల్ పట్టుబడ్డారన్నారు. ఇద్దరిని కామారెడ్డి ద్వితీయశ్రేణి న్యాయమూర్తి చంద్రశేఖర్ ఎదుట హాజరుపరచగా ఒక్కరోజు జైలుశిక్షతోపాటు జరిమానా విధించారు.


