ఇంటి పైనుంచి పడి ఒకరి మృతి
నందిపేట్(ఆర్మూర్): మండలంలోని తల్వేద గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు గోడ పైనుంచి పడి మృతిచెందాడు. కుటుంబీకులు తెలిపిన వివరాలు ఇలా.. తల్వేద గ్రామానికి చెందిన ఎర్ణాపల్లి సురేష్‌గౌడ్ (40) కొన్నేళ్లుగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మెడికల్ దుకాణం నడుపుకుంటూ కుటుంబంతో కలిసి ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అలాగే ప్రయివేట్ బ్యాంకులో వెహికిల్ లోన్లు ఇప్పిస్తుండేవాడు. కాగా నిజామాబాద్‌లోని వినాయక్‌నగర్ ప్రాంతంలో ఇటీవల నూతన గృహ నిర్మాణం ప్రారంభించాడు. సోమవారం ఉదయం నిర్మాణంలో ఉన్న ఇంటిపైకి ఎక్కి గోడలకు నీళ్లు పడుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడ్డాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో తల్వేద గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. సాయంత్రం సొంతూరులోనే అంత్యక్రియలు జరిగాయి. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు.
విద్యుత్ షాక్‌తో రైతు..
ఇందల్వాయి: మండలంలోని ఎల్లారెడ్డిపల్లె గ్రామంలో విద్యుత్ షాక్‌తో ఓ రైతు మృతి చెందాడు. ఎస్సై సందీప్ తెలిపిన వివరాలు ఇలా.. ఎల్లారెడ్డిపల్లె గ్రామా నికి చెందిన బాణావత్ పండరి (50) అనే రైతు సోమవారం ఉదయం వారి ఇంటి పక్కనే ఉన్న పొలం వద్ద ఇటీవల కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు. దీంతో సోమవారం మిగిలిన ఇనుప చువ్వలను తీసివేస్తున్నాడు. ఈక్రమంలో వాటిని పైకి లేపగా, పైన ఉన్న 11 కెవి విద్యుత్ వైర్లకు తగలడంతో అతడికి షాక్ తగిలింది. వెంటనే కుటుంబసభ్యులు అతడిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ఇంటి పైనుంచి పడి ఒకరి మృతి


