డిగ్రీ పరీక్షల్లో కొనసాగుతున్న డిబార్లు
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న డిగ్రీ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ ప రీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ నిత్యం ఏదో ఒక పరీక్ష కేంద్రంలో విద్యార్థులు డిబార్ అవుతున్నారు. ఆర్మూర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ పరీక్ష కేంద్రంలో సోమవారం మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడు తూ ఇద్దరు విద్యార్థులు డిబార్ అయినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో ఏర్పాటు చేసిన మొత్తం 30 పరీక్ష కేంద్రాలలో డిగ్రీ పరీక్షలకు 8,528 మంది అభ్యర్థులకు గాను 8,009 మంది అభ్యర్థులు హాజరు కాగా 517 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. తెయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కే.సంపత్‌కుమార్ నిజామాబాద్‌లోని పలు పరీక్ష కేంద్రాలను సందర్శించి తనిఖీలు నిర్వహించారు.


