ఎయిడ్స్‌ రహిత సమాజమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ఎయిడ్స్‌ రహిత సమాజమే లక్ష్యం

Dec 2 2025 7:24 AM | Updated on Dec 3 2025 8:17 AM

ఎయిడ్

ఎయిడ్స్‌ రహిత సమాజమే లక్ష్యం

ఎయిడ్స్‌ రహిత సమాజమే లక్ష్యం

ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు,

అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి

డీఎంహెచ్‌వో రాజశ్రీ

నిజామాబాద్‌ నాగారం: హెచ్‌ఐవి ఎయిడ్స్‌పై ప్రజల్లో విస్త్తృతమైన అవగాహన కల్పించి, ఎయిడ్స్‌ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేయాలని డీఎంహెచ్‌వో రాజశ్రీ అన్నారు. నగరంలోని జిల్లావైద్యశాఖ కార్యాలయంలో సోమవారం ప్రపంచ ఎయిడ్స్‌ దినం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హెచ్‌ఐవి వ్యాధిగ్రస్తుల పట్ల అపోహలను మూఢనమ్మకాలను తొలగించి వా రిని మానవతా ధృక్పథంతో చూడాలన్నారు. అనంత రం ఎయిడ్స్‌ నియంత్రణపై సిబ్బందితో ప్రతిజ్ఞ చే యించారు. అలాగే ఎయిడ్స్‌ నియంత్రణలో విస్తృతంగా కృషి చేస్తున్న వివిధ విభాగాల సిబ్బందిని, స్వ చ్ఛంద సంస్థల ప్రతినిధులను సత్కరించారు. హెచ్‌ఐవీ బాధితులకు స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా న్యూట్రిషన్‌ కిట్లను అందజేశారు. జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, అదనపు జిల్లా వైద్యాధికారిని దే వి నాగేశ్వరి, మెడికల్‌ కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌ తిరుప తిరావు, డీపీఎం సురేందర్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.

ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులపై వివక్ష చూపరాదు

తెయూ(డిచ్‌పల్లి): హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తుల పై వివక్ష చూపరాదని, వారి పట్ల కరుణ చూపాలని నిజామాబాద్‌ ప్రభుత్వ వైద్య కళాశాల ఫోరెన్సిక్‌ సైన్స్‌ అండ్‌ టాక్సికాలజీ విభాగం హెడ్‌ ప్రొఫెసర్‌ బీవీ నాగమోహన్‌రావు అన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో సోమవారం ప్రపంచ ఎయిడ్స్‌ దినం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. ఎయిడ్స్‌పై అవగాహన పెంపొందించడం, ఎ యిడ్స్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకోవడం కోసం ప్రతి యేటా డిసెంబర్‌ 1న ప్రపంచ ఎయిడ్స్‌ దినం జరుపుకుంటారని తెలిపా రు. అందరికీ సమాన ఆరోగ్య హక్కులు, మానవ గౌ రవం, వివక్ష రహిత సమాజ నిర్మాణానికి కృషి చే యాలని పిలుపునిచ్చారు. తెయూ ఎన్‌ఎస్‌ఎస్‌ యూ నిట్‌ – 2 ప్రోగ్రాం ఆఫీసర్‌ అహ్మద్‌ అబ్దుల్‌ హలీమ్‌ఖాన్‌, ప్రొఫెసర్లు అరుణ, విద్యావర్థిని, కాంట్రాక్టు అధ్యాపకులు శ్రీనివాస్‌, జలంధర్‌ పాల్గొన్నారు.

ఎయిడ్స్‌ రహిత సమాజమే లక్ష్యం1
1/1

ఎయిడ్స్‌ రహిత సమాజమే లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement