జిల్లాలో క్రీడలకు స్వర్ణయుగం రాబోతోంది
● పీసీసీ అధ్యక్షుడు
బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్
● నగరంలో ‘సుబ్బారావు’ అర్బన్ అంతర్
క్రీడాపోటీలు ప్రారంభం
నిజామాబాద్ నాగారం: నిజామాబాద్ జిల్లాలో క్రీడలకు స్వర్ణయుగం రాబోతోందని ిపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. నగరంలోని పాత కలెక్టరేట్ మైదానంలో సోమవారం దివంగత జాతీయస్థాయి కబడ్డీ క్రీడాకారుడు, వ్యాయామ ఉపాధ్యాయుడు సుబ్బారావు స్మారక నిజామాబాద్ అర్బన్ అంతర్ క్రీడాపోటీలను ప్రారంభించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సుబ్బారావు అంటేనే కబడ్డీ, కబడ్డీ అంటేనే సుబ్బారావు అని అన్నారు. ఆయన కుటుంబానికి ఎల్లాప్పుడు అండగా ఉంటామన్నా రు. జిల్లాలో క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడానికి ప్రతి సంవత్సరం ఒక పెద్ద స్పోర్ట్స్ ఈవెంట్‌ను నిర్వహించే అవసరం ఉందని, బొమ్మ ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున ఆ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లానే స్పోర్ట్స్ హబ్‌గా మారాలన్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. జిల్లాలో ఒక్క కోచ్ లేకుండానే అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు తయారవడం నిజామాబాద్ ప్రతిభకు నిదర్శనం అన్నారు. సుబ్బారావు కుటుంబ సభ్యు లు, జిల్లా యువజన క్రీడాశాఖ అధికారి పవన్ కు మార్, డీసీసీ ప్రెసిడెంట్ నాగేష్ రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, మానాల మోహన్ రెడ్డి, జై సింహ గౌడ్, రజనీకాంత్, సంతోష్ కుమార్, గడుగు గంగాధర్, బొబ్బి లి రామకృష్ణ, సాయగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో క్రీడలకు స్వర్ణయుగం రాబోతోంది


