ఒలింపిక్స్‌లో పాల్గొనే స్థాయికి చేరాలి | - | Sakshi
Sakshi News home page

ఒలింపిక్స్‌లో పాల్గొనే స్థాయికి చేరాలి

Dec 2 2025 7:24 AM | Updated on Dec 3 2025 8:17 AM

ఒలింపిక్స్‌లో పాల్గొనే స్థాయికి చేరాలి

ఒలింపిక్స్‌లో పాల్గొనే స్థాయికి చేరాలి

ఒలింపిక్స్‌లో పాల్గొనే స్థాయికి చేరాలి నేడు ఎకై ్సజ్‌ శాఖలో వాహనాల వేలం

కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి పడకల్‌ ఉన్నత పాఠశాల తనిఖీ

డిచ్‌పల్లి(జక్రాన్‌పల్లి): జిల్లా క్రీడాకారులు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకే పరిమితం కాకుండా ఒలింపిక్స్‌లో కూడా పాల్గొనేలా ప్రణాళికాబద్దంగా కృషి చేయాలని కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి అన్నారు. జక్రాన్‌పల్లి మండలం పడకల్‌ గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను కలెక్టర్‌ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలువురు విద్యార్థులు జాతీయస్థాయి వాలీబాల్‌ పోటీలలో పాల్గొని ప్రతిభను చాటడం, పూర్వ విద్యార్థులు స్పోర్ట్స్‌ కోటాలో వివిధ శాఖలలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన విషయాలను తెలుసుకొని వారితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారు సాధించిన పతకాలు, ట్రోఫీలను పరిశీలించి, వారిని అభినందించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. క్రీడల్లో రాణిస్తే విద్య, ఉద్యోగావకాశాల్లో ప్రత్యేక రిజర్వేషన్‌తోపాటు, ఎంతో పేరు, ప్రఖ్యాతులు వస్తాయన్నారు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో రాణిస్తున్న విద్యార్థులను అంతర్జాతీయ స్థాయి క్రీడాపోటీలకు ఎంపిక అయ్యేలా సన్నద్ధం చేసేందుకు సమగ్ర అధ్యయనం చేసి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అంతకుముందు పాఠశాలలో విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనంను, బడి పరిసరాలను తనిఖీ చేశారు. పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక అధికారులు ఉన్నారు.

నిజామాబాద్‌ అర్బన్‌: నగరంలోని సుభాష్‌నగర్‌లోని ఎకై ్సజ్‌ శాఖ కార్యాలయంలో మంగళవారం వాహనాల వేలం నిర్వహిస్తున్నట్లు ఎకై ్సజ్‌శాఖ ఎస్‌హెచ్‌వో స్వప్న ఒక ప్రకటనలో తెలిపారు. ఎకై ్సజ్‌ శాఖ వివిధ కేసులలో స్వాధీనం చేసుకున్న వాహనాలకు నేడు ఉదయం సుభాష్‌నగర్‌లోని ఎకై ్సజ్‌ కార్యాలయంలో బహిరంగంగా వేలం వేస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు ఉదయం 10 గంటలకు హాజరుకావాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement