రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఫరీదుపేట విద్యార్థులు
మాచారెడ్డి: రాష్ట్ర స్థాయి జూనియర్ కబడ్డీ పోటీలకు పాల్వంచ మండలం ఫరీదుపేట ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు ఇద్దరు ఎంపికయ్యారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన అండర్–20 బాయ్స్, గర్ల్స్ విభాగాల్లో జిల్లా జట్టులో గొల్ల నవ్య, ప్రణీత్‌లు ప్రతిభ కనబర్చి రాష్ట్ర జట్టుకు ఎంపికై నట్టు వ్యాయామ ఉపాధ్యాయుడు భాస్కర్‌రెడ్డి తెలిపారు. బాలికల రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఈ నెల 2 నుంచి 4 వరకు నల్గొండ జిల్లా హాలియాలో, బాలుర రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఈ నెల 5 నుంచి 7 వరకు మహబూబ్‌నగర్‌లో జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్‌ఎంలు రామ్మనోహర్‌రావ్, ఎస్‌ఎంసీ చైర్మన్ సౌజన్య, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.
మద్నూర్(జుక్కల్): మండలంలోని పెద్ద ఎక్లార గేటు వద్ద గల బాలికల సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థినులు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ జి.స్వప్న ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయి కబడ్డీ అండర్–20 విభాగంలో పాఠశాలకు చెందిన బి. సంధ్యారాణి, కె.నిఖిత, ఈ.అంజలి, ఎం.సృజన రాష్ట్ర పోటీలకు ఎంపికై నట్లు ఆమె తెలిపారు. డిసెంబర్ 1 నుంచి 5 వరకు నల్గొండలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో గురుకుల విద్యార్థినులు పాల్గొంటారని తెలియజేశారు.
మోపాల్: నిజామాబాద్ సౌత్ రేంజ్ ఎఫ్‌ఆర్‌వో రాధిక(డిప్యుటేషన్) వరంగల్ రేంజ్‌కు బదిలీ అయ్యారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సువర్ణ ఆదేశాల మేరకు బదిలీపై వెళ్లగా, ఆమె స్థానంలో ఇందల్వాయి రేంజ్ అధికారి రవి మోహన్ భట్‌కు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. రాధిక ఎఫ్‌ఆర్‌వోగా సుమారు 20 నెలలు ఇక్కడ సేవలందించారు.
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఫరీదుపేట విద్యార్థులు
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఫరీదుపేట విద్యార్థులు


