కొనుగోలు కేంద్రం నుంచి వడ్ల సంచుల చోరీ | - | Sakshi
Sakshi News home page

కొనుగోలు కేంద్రం నుంచి వడ్ల సంచుల చోరీ

Dec 1 2025 7:32 AM | Updated on Dec 1 2025 7:32 AM

కొనుగోలు కేంద్రం నుంచి వడ్ల సంచుల చోరీ

కొనుగోలు కేంద్రం నుంచి వడ్ల సంచుల చోరీ

తాడ్వాయి: మండలంలోని కృష్ణాజివాడి శివారులో ఉన్న రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగో లు కేంద్రం నుంచి ముగ్గురి రైతులకు చెందిన పది వడ్ల సంచులు చోరీకి గురైనట్లు గ్రామస్తులు ఆదివారం తె లిపారు. కృష్ణాజివాడి గ్రామానికి చెందిన కుమ్మరి భిక్షపతి, జంగం వీరేశం, మామిండ్ల నవీన్‌ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద వడ్లను పోశారు. ఆ వడ్లు మ్యాచర్‌ రావడంతో సొసైటీ ఆధ్వర్యంలో ఐదు రోజుల క్రితం తూకం వేసి ఆ సంచులను ఒకేదగ్గర ఉంచారు. లారీలు సరిగా రాక పోవడంతో ఇదే అదునుగా చూసుకొని దుండగులు కుమ్మరి భిక్షపతికి చెందిన రెండు సంచులు, జంగం వీరేశానికి చెందిన నాలుగు సంచులు, మామిండ్ల నవీన్‌కు చెందిన నాలుగు సంచులను దొంగిలించారన్నారు. తూకం వేసిన వెంటనే వడ్లను తరలిస్తే ఇలా జరిగేది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందంచి లారీలను రప్పించి ధాన్యం తరలేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఐదు ట్రాన్స్‌ఫార్మర్ల కాయిల్స్‌ చోరీ

బాల్కొండ: మండలంలోని కిసాన్‌నగర్‌ శివారులో నాగుల కుంట చెరువు సమీపంలో ఉన్న వ్యవసాయ క్షేత్రాల నుంచి శనివారం అర్ధరాత్రి ఐదు ట్రాన్స్‌ఫార్మర్ల కాయిల్స్‌ చోరీకి గురయ్యాయి. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. పంట భూముల్లో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి కాయిల్స్‌తో పాటు, ఆయిల్‌ను ఎత్తుకెళ్లారన్నారు. ట్రాన్స్‌కో ఏఈ సబావత్‌ కిషన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శైలేందర్‌ తెలిపారు.

వైన్‌ షాప్‌లో చోరీ

ఇందల్వాయి: మండలంలోని తిర్మన్‌పల్లి గ్రామంలో ఉన్న దుర్గా వైన్‌ షాప్‌ లో శనివారం రాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డట్లు ఎస్సై సందీప్‌ తెలిపారు. ఆదివారం ఉదయం దుకాణం తెరిచేందుకు యజమా ని ప్రభాకర్‌ రాగా తాళం పగులగొట్టి ఉన్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. చోరీలో రూ. ఒకటిన్నర లక్షలు చోరీకి గురైనట్లు తెలిపారు. దుకాణ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement