సర్పంచ్ నుంచి మంత్రి వరకూ..
మోర్తాడ్: కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లికి చెందిన దివంగత ఏలేటి మహిపాల్‌రెడ్డి తన రాజకీయ జీవితంలో అరుదైన రికార్డులను నమోదు చేసుకున్నారు. సొంత గ్రామంలో సర్పంచ్ పదవికి తనబంధువులే పోటీపడటంతో పొరుగున ఉన్న కోనాపూర్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అలా 1981లో కోనాపూర్ సర్పంచ్‌గా ఎంపికై న ఆయన భీమ్‌గల్ పంచాయతీ సమితికి అధ్యక్ష పదవిని సునాయాసంగా దక్కించుకున్నారు. మండల పరిషత్‌ల ఆవిర్భావానికి ముందు పంచాయతీ సమితి ఉండేది. సమితి పరిధిలోని సర్పంచ్‌లే తమలో ఒకరిని ఆ సమితికి అధ్యక్షు డిని ఎన్నుకునేవారు. భీమ్‌గల్ పంచాయతీ సమితి అధ్యక్షుడిగా కొనసాగుతూనే మహిపాల్‌రెడ్డి 1982లో టీడీపీలో చేరారు. 1983 ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలైన ఆయన 1985లో మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎంపికై నారు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎంపిక కావడంతో పాటు నాటి ముఖ్యమంత్రి దివంగత ఎన్టీరామారావు మంత్రివర్గంలో అటవీ శాఖ మంత్రిగా పదవీని చేపట్టారు. సర్పంచ్‌తో మొదలైన మహిపాల్ రెడ్డి రాజకీయ జీవితం మంత్రి వరకూ కొనసాగింది.
ఏలేటి మహిపాల్‌రెడ్డి
రాజకీయ ప్రస్థానం
భీమ్‌గల్ పంచాయతీ సమితి
అధ్యక్షుడిగా ఎన్నిక
ఎమ్మెల్యేగా ఎన్నికై న మొదటిసారే
మంత్రిగా అవకాశం


