‘మీ–సేవ’ జిల్లా అధ్యక్షుడిగా రాజు | - | Sakshi
Sakshi News home page

‘మీ–సేవ’ జిల్లా అధ్యక్షుడిగా రాజు

Dec 1 2025 7:24 AM | Updated on Dec 1 2025 7:24 AM

‘మీ–స

‘మీ–సేవ’ జిల్లా అధ్యక్షుడిగా రాజు

నాందేవ్‌వాడలో భారీ చోరీ

సుభాష్‌నగర్‌: నగరంలోని న్యూ అంబేడ్కర్‌ భవన్‌లో ఆదివారం మీ–సేవ ఆపరేటర్స్‌ అ సోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడి ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా అసో సియేషన్‌ ఎన్నికలు నిర్వహించినట్లు ఎన్నిక ల అధికారులు శ్యామ్‌కుమార్‌, రిటైర్డ్‌ ప్రభు త్వ ప్రిన్సిపాల్‌ కాలేవార్‌ రవి తెలిపారు. అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడిగా సితారి క్షవీణ్‌ (రాజు) విజయం సాధించినట్లు ఎన్నికల కమిటీ నిర్వాహకులు గూడూరి శేఖర్‌, మహమ్మద్‌ అస్లాం, మహమ్మద్‌ షాహిద్‌, కుందెన్‌ ప్రభుదాస్‌, శివప్రసాద్‌ తెలిపారు. అసోసియేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

జాతీయ ఏకీకరణ

శిబిరంలో తెయూ విద్యార్థి

తెయూ(డిచ్‌పల్లి): గుజరాత్‌లోని సర్దార్‌ వ ల్లభాయ్‌ పటేల్‌ విశ్వవిద్యాలయంలో జరిగిన జాతీయస్థాయి ఏకీకరణ సదస్సుకు తె లంగాణతోపాటుగా దేశ నలుమూలల నుంచి 10 రాష్ట్రాల ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు పా ల్గొనగా, తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థి అశోక్‌ పాల్గొన్నారు. ఈనెల 22 నుంచి వారం రోజులపాటు నిర్వహించిన సదస్సు ఇటీవల విజయవంతంగా ముగిసింది. రాష్ట్ర ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు ప్రదర్శించిన సాంప్రదాయ డప్పుదరువు, బతుకమ్మ, బోనా లు, మరీ ప్రత్యేకంగా పోతరాజు విన్యాసాలు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్లు, వలంటీర్ల ప్రశంసలు అందుకున్నాయి. తెలంగాణ రీజినల్‌ డైరెక్టర్‌ రామకృష్ణ వలంటీర్లను ప్రత్యేకంగా అభినందించారు. ఎన్‌ఐసీ కోఆర్డినేటర్‌ జాగృతి సురేరా, సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ యూనివర్సిటీ వీసీ నిరంజన్‌ పటేల్‌ చేతుల మీదుగా ధ్రువపత్రాలను అందుకున్నారు.

ఎనిమిది తులాల బంగారం,

80 తులాల వెండి అపహరణ

నిజామాబాద్‌అర్బన్‌: జిల్లా కేంద్రంలోని నాందేవ్‌వాడలో భారీ చోరీ జరిగింది. మూడో టౌన్‌ ఎస్సై హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. నాందేవ్‌వాడ ప్రాంతంలో నివాసం ఉంటున్న కృష్ణవేణి అనే మహిళ ఈ నెల 28న ఇంటికి తాళం వేసి వేరే గ్రామానికి వెళ్లారు. దుండగులు రాత్రి ఇంటి తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఆదివారం ఉదయం ఇంటికి వచ్చిన బాధిత కుటుంబ సభ్యులు ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ చోరీలో బీరువాలో ఉన్న ఎనిమిది తులాల బంగారం, ఎనభై తులాల వెండి, ల్యాప్‌ టాప్‌ చోరీకి గురైనట్లు బాధితురాలు పేర్కొ న్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

‘మీ–సేవ’ జిల్లా  అధ్యక్షుడిగా రాజు 1
1/1

‘మీ–సేవ’ జిల్లా అధ్యక్షుడిగా రాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement