రెండో విడత తొలిరోజు 270
● ప్రారంభమైన నామినేషన్‌ల ప్రక్రియ
● సర్పంచ్ స్థానాలకు 122..
వార్డుస్థానాలకు 148
సుభాష్‌నగర్: గ్రామపంచాయతీ ఎన్నికల్లోభాగంగా రెండో విడత ఎన్నికల నిర్వహణ కోసం నామినేషన్‌ల స్వీకరణ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. తొలిరోజు 270 నామినేషన్లు దాఖలయ్యాయి. నిజామాబాద్ రెవెన్యూ డివిజన్‌తోపాటు ఆర్మూర్ డివిజన్‌లోని జక్రాన్‌పల్లి మండలం పరిధిలోని 196 జీపీలు, 1,760 వార్డుస్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. తొలిరోజు సర్పంచ్ స్థానాలకు 122 నామినేషన్లు, వార్డుస్థానాలకు 148 మంది నామినేషన్‌లు దాఖలు చేశారు. నామినేషన్ల స్వీకరణ కోసం 59 కేంద్రాలను ఏర్పాటు చేశారు. క్లస్టర్ గ్రామంగా గుర్తించి నాలుగు నుంచి ఐదు గ్రామాలకు సంబంధించిన సర్పంచ్, వార్డుస్థానాల అభ్యర్థుల నామినేషన్‌లను ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించారు. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్‌ల దాఖలుకు అవకాశం ఉంది. కేంద్రాల వద్ద పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందితో హెల్ప్‌డెస్క్‌లు, పోలీస్ సిబ్బంది బందోబస్తు ఏర్పాటుచేశారు.
మండలాలవారీగా దాఖలైన నామినేషన్లు


