ఒక మడి.. 30 రకాల నారు
మాక్లూర్ మండలం మాదాపూర్ శివారులో రోడ్డు పక్కన విత్తనోత్పత్తి కోసం ఎస్‌ఆర్‌ఐ పద్ధతిలో అంకుర సీడ్స్ కంపెనీ వారు 30 రకాల వంగడాల నారుమళ్లను బాక్సులుగా ఏర్పాటు చేశారు. మడి చుట్టు చీరలతో కంచె ఏర్పాటు చేశారు. మాములుగా నారుమడి ఒకే దగ్గర ఉంటుంది. ఇలా బాక్సులుగా నారును ఏర్పాటు చేసి ఒకే మడిలో 30 రకాల వంగడాలను ఉత్పత్తి చేస్తామని సీడ్స్ కంపెనీ యజమానులు తెలిపారు. ఈ పద్ధతిని రోడ్డుపై వెళ్లేవారు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
–సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్
ఒక మడి.. 30 రకాల నారు


