క్రైం కార్నర్
రోడ్డు ప్రమాదంలో జీపీ కార్మికుడు మృతి
డిచ్‌పల్లి: మండలంలోని ధర్మారం(బి)లో గ్రామ పంచాయతీ కార్మికుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు డిచ్‌పల్లి ఎస్సై ఎండీ ఆరిఫ్ తెలిపారు. ధర్మారం(బి) గ్రామానికి చెందిన మొగుళ్ల కుంటయ్య (69) గ్రామ పంచాయతీలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈక్రమంలో శనివారం ఉదయం వీధి లైట్లు ఆఫ్ చేయడానికి కుంటయ్య తన సైకిల్‌పై బయలుదేరాడు. బస్టాండ్ సమీపంలోని మెంట్రాజ్‌పల్లి రోడ్డు వద్దకు రాగానే అతడిని నిజామాబాద్ వైపు నుంచి వేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డీసీఎం డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
రాజంపేట మండలంలో..
రాజంపేట: మండలంలోని శివాయిపల్లి గ్రామంలో ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. శివాయిపల్లి గ్రామానికి చెందిన గజ్జెల నరేష్ (28) శుక్రవారం సాయంత్రం కామారెడ్డికి బైక్‌పై బయలుదేరాడు.రాజంపేట సమీపంలో అతడిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడిక్క డే మృతిచెందాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
22.5 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం
నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండల కేంద్రానికి చెందిన యాదాగౌడ్ వద్ద నుంచి శనివారం 22.5 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు బాన్సువాడ ఎకై ్సజ్ సీఐ దిలీప్ తెలిపారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం నిల్వలు,విక్రయాలు చే పట్టడంతో యాదాగౌడ్‌పై కేసు నమోదు చేశామన్నారు. బాన్సువాడ ఎకై ్స జ్ ఎస్సై శ్రావణి, సిబ్బంది శరీఫ్, శ్రీకాంత్, రూపేష్, ప్రేమలత తదితరులు ఉన్నారు.
క్రైం కార్నర్
క్రైం కార్నర్


