కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తా
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తానని డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నాగేష్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాగేష్‌రెడ్డి మాట్లాడారు. అందరి ఆశీస్సులతోనే జిల్లా అధ్యక్ష పార్టీ బాధ్యతలు దక్కాయన్నారు. జిల్లాలోని క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని పేర్కొన్నారు. డిసెంబర్ 1న నగరంలోని లక్ష్మీ కల్యాణ మండపంలో ప్రమాణ స్వీకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమానికి ఏఐసీసీ, పీసీసీ నేతలు, జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు కార్యకర్తలు వస్తున్నారన్నారు. జిల్లా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, శేఖర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


