హైకోర్టు జడ్జికి ఘన స్వాగతం
సుభాష్‌నగర్: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి మాధవిదేవి శనివారం నిజామాబాద్‌కు విచ్చేసిన సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. నగరంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ వద్ద వారికి జిల్లా జడ్జి జీవీఎన్ భారతలక్ష్మి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయి చైతన్య, ఆయా శాఖల జిల్లా అధికారులు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం జిల్లా జడ్జి, కలెక్టర్, పోలీస్ కమిషనర్లతో హైకోర్టు న్యాయమూర్తి కొద్దిసేపు భేటీ అయ్యారు.
ఆర్మూర్ కోర్టు సమస్యలను పరిష్కరించాలి
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ కోర్టులో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఆర్మూర్ బార్ అసోసియేషన్ స భ్యులు హైకోర్టు జడ్జి మాధవిదేవిని కోరారు. జిల్లాకేంద్రానికి శనివారం వారు విచ్చేయగా ఆర్మూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి, సత్కారించారు. అనంతరం ఆర్మూర్ అధ్యక్షుడు జక్కుల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి జెస్సు అనిల్ కుమార్ సమస్యలను హైకోర్టు జడ్జికి విన్న వించారు. బార్ ప్రతినిధులు ఆనంద్, గంగారాం, శ్రావణ్, శంకర్, కొండి పవన్, గణేష్ పాల్గొన్నారు.
హైకోర్టు జడ్జికి ఘన స్వాగతం


