తొలి అంకం ముగిసింది..
న్యూస్‌రీల్
నిజామాబాద్
ఒక్కో పార్టీ.. ఒక్కో తీరు..
సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ప్రధాన
పార్టీలు ఒక్కో మార్గాన్ని ఎంచుకున్నాయి.
ఆదివారం శ్రీ 30 శ్రీ నవంబర్ శ్రీ 2025
– 8లో u
సుభాష్‌నగర్/బోధన్ : గ్రామపంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ల పర్వం శనివారం సాయంత్రంతో ముగిసింది. చివరి రోజు సర్పంచ్, వార్డు స్థానాల కోసం అభ్యర్థులు భారీగా తరలిరావడంతో రాత్రి వరకు స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. సా యంత్రం 5 గంటల్లోపు కేంద్రంలోకి వచ్చిన వారికి క్యూలైన్ టోకెన్లు అందించి దరఖాస్తులు స్వీకరించా రు. జిల్లాలో మొదటి విడతలో బోధన్ డివిజన్‌లోని 184 జీపీలు, 1,642 వార్డుస్థానాలకు పోటీ జరగనుంది.
మొత్తం 2,61,210 మంది ఓటర్లు ఉండగా, 1,23,790 పురుషులు, 1,37,413 మహిళలు, 7 ఇతరులు తమ ఓట్లను వినియోగించుకోనున్నారు.
నామినేషన్ల పర్వం చివరి రోజు కావడం.. అప్పటికే బుజ్జగింపుల ప్రయత్నాలు ఫలించకపోవడంతో భారీ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. రెండు రోజులకు సర్పంచ్ స్థానాలకు 304 మంది నామపత్రాలు అందజేయగా, వార్డు స్థానాలకు 382 మాత్రమే దాఖలు చేశారు. చివరి రోజు ఊహించిన దానికంటే ఎక్కువ మంది అభ్యర్థులు కేంద్రాలకు తరలివచ్చారు. అధికారులు సైతం అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకున్నా.. తలకు మించిన భారమైంది.
రాత్రి 1గంట వరకు అందిన సమాచారం ప్రకారం నవీపేట్ మినహా బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పోతంగల్, రుద్రూర్, వర్ని, ఎడపల్లి, సాలూర, రెంజల్ మండలాల్లో సర్పంచ్ స్థానాలకు 980 నామినేషన్లు దాఖల య్యాయి. వార్డు స్థానాలకు 2,889 నామినేషన్లు దాఖలయ్యాయి.
గ్రామపంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ల ప్ర క్రియ శనివారంతో ముగి యగా, ఆదివారం స్క్రూటినీ ఉంటుంది. డిసెంబర్ 3న మధ్యాహ్నం 3 గంటల్లోపు నా మినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.
అదేరోజు అభ్యర్థుల జాబితా, గుర్తులను కేటాయిస్తారు. డిసెంబర్ 11న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్, తర్వాత ఫలితాలు ప్రకటిస్తారు.
అర్ధరాత్రి వరకూ కొనసాగిన
నామినేషన్ల స్వీకరణ
సాయంత్రం 5 గంటల తర్వాత
గేట్లు మూసివేత
టోకెన్లు ఇచ్చి అభ్యర్థుల నుంచి
దరఖాస్తులు తీసుకున్న అధికారులు
నవీపేట మినహా 10 మండలాల్లో సర్పంచ్ స్థానాలకు 980 నామినేషన్లు
తొలి అంకం ముగిసింది..
తొలి అంకం ముగిసింది..
తొలి అంకం ముగిసింది..


