మహిళలే కింగ్ మేకర్లు..
మోర్తాడ్(బాల్కొండ): జిల్లాలోని గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాలలో పోటీ చేసే అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించడంలో ఎవరు కీలకం.. అంటే వచ్చే సమాధానం ఒక్కటే మహిళా ఓటర్లు. అన్ని స్థానాల్లో ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో గెలుపు గుర్రాలను నిర్ణయించడంలో మహిళా ఓటర్ల పాత్ర కీలకంగా మారింది. జిల్లాలోని 545 గ్రామ పంచాయతీలలో ఓటర్ల సంఖ్య 8,51,417గా నమోదైంది. ఇందులో పురుషులు 3,96,778 మంది, మహిళా ఓటర్లు 4,54,621 మంది ఉన్నారు. ఇతర ఓటర్లు 18 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య 57,843 ఎక్కువగా ఉండటంతో సర్పంచ్, వార్డు అభ్యర్థుల భవితవ్యం మహిళల చేతుల్లోనే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మహిళలు ఎటు మొగ్గు చూపితే వారే గెలిచే పరిస్థితి కనిపిస్తుండటంతో పోటీకి ఆసక్తి చూపుతున్న అభ్యర్థులు వారిని ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలు, బ్యాంకు లింకేజీ రుణాలకు సంబంధించి వడ్డీ వాపస్ రావడంతో అధికార పార్టీ అభ్యర్థులకు కలిసివచ్చే అవకాశమని కాంగ్రెస్ నా యకులు భావిస్తున్నారు. కా గా, పింఛన్‌ల మొత్తాన్ని పెంచకపోవడాన్ని అ స్త్రంగా చేసుకోవాలని ప్రతిప క్ష పార్టీల అ భ్యర్థు లు ఆలో చన చేస్తున్నారు.
అభ్యర్థుల గెలుపును
నిర్ణయించేది అతివలే..
పంచాయతీ ఓటర్లలో పురుషుల కంటే మహిళల ఓట్లు ఎక్కువ
మహిళా ఓటర్లను
ఆకట్టుకునేందుకు అభ్యర్థుల
ప్రయత్నాలు


